చంద్రబాబు ఓటు చెల్లదు: ఈసి, మిత్రుడు మోడీపై చర్యకి
హైదరాబాద్/గాంధీనగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ బుధవారం చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఓటేశానని చంద్రబాబు పోలింగ్ కేంద్రం వద్ద చెప్పడం ఈసి నిబంధనలకు విరుద్దమని చెప్పారు. నిబంధనను పట్టించుకోని చంద్రబాబు ఓటును చెల్లని దానిగా పరిగణిస్తామని చెప్పారు.

చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో పాటు నారా లోకేష్, బ్రాహ్మిణి, వసుంధరలు వచ్చి ఓటు వేశారు. ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ... టిడిపి, బిజెపి పొత్తులో భాగంగా తాను కమలం గుర్తుకు ఓటేశానని చెప్పడం సరికాదని చెప్పారు. అందుకే ఆయన ఓటును చెల్లని దానిగా పరిగణిస్తామని చెప్పారు.
మోడీపై చర్యలకు ఈసి ఆదేశం
మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం గుజరాత్ చీఫ్ సెక్రటరీని, డిజిపిని ఆదేశించింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మోడీ, ఇతరుల పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నరేంద్ర మోడీ తీరు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉందని ఈసి అభిప్రాయపడింది. మోడీ పైన కేసు నమోదు చేయాలని సూచించింది. మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం కమలం గుర్తుతో సెల్ఫీ (సొంత ఫోటో) తీసుకున్న విషయం తెలిసిందే. దీనిని ఈసి తీవ్రంగా పరిగణించింది.












Click it and Unblock the Notifications