వాల్మీకి స్కామ్ మైస్టర్ మైండ్ మాజీ మంత్రి, కేటీఆర్ చేతికి అస్త్రం, పక్క రాష్ట్రంలో !
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్‌లో జరిగిన రూ. 196 కోట్ల కుంభకోణానికి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బి. నాగేంద్ర ప్రధాన సూత్రధారి అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కు సంబంధించి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే పలు ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ మాజీ మంత్రి నాగేంద్ర పీకల్లోతులో చిక్కుకున్నాడు.
అంతేకాకుండా కర్ణాటక వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలోని సొమ్మును కూడా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు వినియోగించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన కోట్లాది రూపాయల వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం కేసును విచారించిన ఈడీ ఇప్పుడు కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించింది. ఇందులో కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్రపై ఈడీ ఆరోపణలు చేపింది.

ఈడీ సమర్పించిన చార్జిషీట్‌లో వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కేసుకు సంబందించి ప్రతి దశలోనూ కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్రకు స్వయంగా ప్రమేయం ఉందని, ఆయనే ఈ స్కామ్ డీల్ చేసినట్లు సమాచారం ఉందని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అంటే వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి నాగేంద్ర అని ఈడీ తేల్చిందని సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
కర్ణాటక
మాజీ మంత్రి బి. నాగేంద్ర, హైదరాబాద్ కు చెందిన సత్యనారాయణవర్మతో తనకున్న సాన్నిహిత్యం, డబ్బు వినియోగం గురించి నాగేంద్ర ప్రస్తావించారు. నాగేంద్ర ఆదేశాల మేరకు ఈ స్కామ్ లావాదేవీలు మొత్తం జరిగాయని ఈడీ విచారణలో వెలుగు చూసింది. ఈ స్కామ్ లోని రూ. 21 కోట్ల డబ్బు బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికలకు వినియోగించారని ఈడీ గుర్తించింది.

బెంగుళూరు, బళ్లారిలో ఈ స్కామ్ నగదు లావాదేవీల దందా జరిగినట్లు ఈడీ చార్ఝ్ షీట్ లో వివరించింది మాజీ మంత్రి నాగేంద్రతో పాటు ఐదుగురు నిందితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 82వ సీసీహెచ్ పీపుల్స్ కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కు సంబందించిన డబ్బులను తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కర్చు పెట్టారని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ ఇప్పటికే చాలాసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే












Click it and Unblock the Notifications