శేఖర్ రెడ్డికి మరో షాకిచ్చిన ఈడీ.. 30 కేజీల గోల్డ్ బార్స్ కూడా పాయె..
మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న శేఖర్ రెడ్డికి ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనవి, ఆయన బంధువులకు సంబంధించిన రూ.8.56 కోట్ల విలువైన 30 కేజీల గోల్డ్ బార్స్ ను సోమవారం జప్తు చేసింది.
న్యూఢిల్లీ : తమిళనాడు ఇసుక క్వారీల వ్యాపారంలో చక్రం తిప్పి, మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న శేఖర్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనవి, ఆయన బంధువులకు సంబంధించిన రూ.8.56 కోట్ల విలువైన 30 కేజీల గోల్డ్ బార్స్ ను ఈడీ అటాచ్ చేసింది.
మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనల మేరకు పాత నోట్లను కొత్త నోట్లకు మార్చుకునే కేసుకు సంబంధించి రెడ్డి, ఆయన బంధువులకు చెందిన రూ.8,56,99,350 విలువైన 30 కేజీల గోల్డ్ బార్స్ ను అటాచ్ చేస్తున్నామని ఏజెన్సీ జోనల్ ఆఫీసు సోమవారం ప్రొవిజనల్ అటాచ్ మెంట్ ఆర్డర్ జారీచేసిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది.

నల్లధనం నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం శేఖర్ రెడ్డి మనీ లాండరింగ్ కు పాల్పడి ఐటీ డిపార్ట్ మెంట్ తనిఖీల్లో పట్టుబడ్డారు. తమిళనాడుతో సహా దేశమంతటా శేఖర్ రెడ్డి వ్యవహారం సంచలనం రేపింది.
ఐటీ దాడుల్లో రూ.142 కోట్ల అక్రమ ఆదాయం ఆయన వద్ద ఉన్నట్టు తేలింది. రూ.34 కోట్ల కొత్త నోట్లను, రూ.97 కోట్ల పాత నోట్లను, 177 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈయన్ని బోర్డు సభ్యుడిగా తీసేసింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రూ.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయగా, తాజాగా 30 కేజీల గోల్డ్ బార్స్ ను కూడా అటాచ్ చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications