దయానిధి మారన్‌కు షాక్: 742 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
చెన్నై: డీఎంకే లీడర్, కేంద్ర మాజీ టెలికం శాఖ మంత్రి దయానిధి మారన్‌కు చెందిన రూ. 742 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కేసులో మనీలాండరింగ్ అభియోగాలను దయానిధి మారన్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈడీ బుధవారం తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తుల్లో మారన్, ఆయన కుటుంబ సభ్యులు, సహచరుల ఆస్తులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 2014 మొదటి వారంలో ఈడీ ఢిల్లీ ఆఫీసులో రెండు నుంచి మూడు రోజుల పాటు దయానిధి మారన్‌ను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.

మనీలాండరింగ్ కేసులో సీబీఐ పలు చార్జిషీట్లను కూడా దాఖలు చేసింది. 2004-07 కాలంలో కేంద్ర టెలికం శాఖ మంత్రిగా దయానిధి మారన్ పని చేశారు. ఆ సమయంలో చెన్నైలోని ఎయిర్ సెల్ కంపెనీ ప్రమోటరైన శివశంకరన్ 2జి స్పెక్ట్రం లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
రెండు సంవత్సరాల పాటు ఆయన కంపెనీకి లైసెన్సు ఇవ్వకుండా ఎయిర్ సెల్ కంపెనీని మలేసియాకి చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేయాలని ఆయనపైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. దీంతో చేసేదేమిలేక డిసెంబర్ 2006లో ఎయిర్ సెల్ కంపెనీలోని మెజారిటీ షేర్లను మాక్సిస్ కంపెనీకి అమ్మేశాడు.
ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎయిర్ సెల్‌కి 14 లైసెన్సులూ వచ్చేలా చేశాడు. ఎయిర్ సెల్ కంపెనీని తనకు అమ్మేలా చేసినందుకు మాక్సిస్ కంపెనీ దయానిధి మారన్ బ్రదర్ కంపెనీ సన్ డైరెక్ట్ కంపెనీలో రూ.599.01 కోట్లు పెట్టుబడి పెట్టాడని సీబీఐ తన నివేదికలో పేర్కొంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications