ఫేమస్ నటికి ఈడీ నోటీసులు, ఐఆర్ఎస్ అధికారితో ఏమిటి లింక్, సార్ ఇప్పటికే అందర్ !

బెంగళూరు/హైదరాబాద్/న్యూఢిల్లీ: గజ, దృశ్యం, దృశ్యం 2 (కన్నడ), నమ్మ యజమన్రుతో సహ పలు సూపర్ డూపర్ హిట్ కన్నడ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న బహుబాష నటి నవ్యా నాయర్ ఇప్పుడు మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు చిక్కంది. నవ్యా నాయర్ మీద ఈడీ అధికారులు నిఘా వెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో కథానాయికగా కూడా నటించిన ఈ బహుభాషా నటి నవ్యా నాయర్ కు ఐఆర్‌ఎస్‌ అధికారికి లింక్ ఉందని వెలుగు చూసింది. అనవసరమైన సమయంలో నగదు లావాదేవీలు జరిపిందని, అక్రమ ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టు అయిన ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్‌తో నవ్యా నాయర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ED officials have issued notices to actress Navya Nair who is linked with an IRS officer
అక్రమ నగదు లావాదేవీల కేసులో అరెస్టు అయిన ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్ నుంచి నటి నవ్యా నాయర్ కు భారీ మొత్తంలో నగదు అందిందని, బహుమానాలు అందాయని అధికారుల విచారణలో వెలుగు చేసింది. అక్రమాస్తుల ఆరోపణలపై సచిన్ సావంత్ అనే అధికారిని ఇటీవల ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, 2002కి సంబంధించిన కేసులో సచిన్ సావంత్ అరెస్టు అయ్యాడు. కస్టమ్స్ అదనపు కమిషనర్‌గా సచిన్ సావంత్ పనిచేశారు. గత జూన్ 27న లక్నోలో సచిన్ సావంత్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసు విచారణకు హాజరు కావాలని బహుబాష నటి నవ్యా నాయర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసింది.

నవ్యా నాయర్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభకార్యాలు జరిగిన సమయంలో ఐఆర్ఎస్ అధికారి సవిచ్ సావంత్ భారీ మొత్తంలో ఖరీదైన బహుమతులు ఇచ్చాడని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈడీ అధికారుల విచారణకు నవ్యా నాయర్ హాజరు అయిన తరువాత ఆమె మీద కూడా చట్టపరంగా ఈడీ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+