మంత్రి మైండ్ బ్లాక్, ఒకేసారి 10 ప్రాంతాల్లో రైడ్స్, జైల్లో ఉన్నా వాళ్లను మాత్రం వదల్లేదు !

చెన్నై/తిరుచ్చి: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంలోని సీనియర్ మంత్రికి ఈడీ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నిరుద్యోగులు, అమాయకుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళాడు మంత్రి సెంథిల్ బాలాజీ అనుచరులకు ఈడీ అధికారులు సినిమా చూపిస్తున్నారు.

తమిళనాడులోని ఎంకే. స్టాలిన్ ప్రభుత్వంలో సెంథిల్ బాలాజీ మంత్రిగా పని చేస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న సెంథిల్ బాలాజీ తరువాత జయలలిత దగ్గర మంచి మార్కులు కొట్టేసి మంత్రి పదవి దక్కించుకున్నారు. జయలలిత ఉన్నంత వరకు తమిళనాడులో చక్రం తిప్పిన సెంథిల్ బాలాజీ అనంతరం జయలలిత మరణించిన తరువాత కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు.

ED searches houses and offices of Tamil Nadu Minister Senthil Balajis close friends

ఎడప్పాడి పళనిస్వామి మంత్రి వర్గంలో మంత్రిగా పని చేసిన సెంథిల్ బాలాజీ తరువాత డీఎంకేలో చేరారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సెంథిల్ బాలాజీ మంత్రి అయ్యారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో సెంథిల్ బాలాజీ, ఆయన అనుచరులు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.

ఇదే ఆరోపణపై జూన్ 14వ తేదీన ఈడీ అధికారులు తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ముందు ఆయన్ను హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న ప్రత్యేక కోర్టు మంత్రి సెంథిల్ బాలాజీని సెప్టెంబర్ 15వ తేదీ వరకు రిమాండ్ కు తరలించాలని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ED searches houses and offices of Tamil Nadu Minister Senthil Balajis close friends

ఇదే సమయంలో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి చెందిన అనుచరుల మీద ఈడీ అధికారులు నిఘా వేశారు. మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు, కరూర్, తిరుచ్చి తదితర ప్రాంతాల్లోని మంత్రి సెంథిల్ బాలాజీ అనుచరులు, బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన 10 స్థావరాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+