వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా, రాహుల్ కు ఈడీ సమన్లు-నేషనల్ హెరాల్డ్ కేసులో జూన్ 8న రావాలంటూ..

|
Google Oneindia TeluguNews

2011-12 నాటి నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందజేసిందని, వారిని ఏజెన్సీ ముందు హాజరుకావాలని కోరినట్లు ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా తెలిపారు.

జూన్ 8న ఈడీ ఎదుట హాజరుకావాలని ఈడీ కోరింది. అలాగే జూన్ 2వ తేదీ హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరగా.. తాను దేశం వెలుపల ఉన్నందున మరికొంత సమయం కావాలని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ ను కూడా సోనియాతో కలిపి జూన్ 8న హాజరుకావాలని ఈడీ కోరింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ లీగల్ సెల్ నేత అభిషేక్ మనుసింఘ్వీ వెల్లడించారు. మరోవైపు ఈడీ సమన్లపై కాంగ్రెస్ మండిపడింది.

ed summoned sonia, rahul gandhi to appear before them in national herald case on june 8

ప్రతిసారీ నేషనల్ హెరాల్డ్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బీజేపీ పూర్వీకుల్ని వెనకేసుకువస్తోందని, స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని, అగౌరవపరిచిందని సూర్జేవాలా ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1942లో ప్రారంభించారని, అప్పట్లో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారని, నేడు మోదీ ప్రభుత్వం ఈడీని కూడా అదే పనిగా ఉపయోగించుకుంటోందని రణదీప్ సూర్జేవాలా అన్నారు. అసలు మనీలాండరింగ్ లేనప్పుడు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఈ చర్య పగ, చిన్నతనం, భయం, రాజకీయ చౌకబారుతనంతో కూడుకున్నదన్నారు.

English summary
enforment directorate has issued notices to congress chief sonia gandhi and his son rahul gandhi to appear before them in national herald case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X