ట్రెండ్ అయింది, అలా చేస్తే రేప్ అనరు: హైకోర్టు సంచలనం
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తే అత్యాచారం కిందికి రాదని బొంబాయి కోర్టు సంచలన వ్యాఖ్య చేసింది.
ముంబై: పెళ్లిచేసుకుంటానని హామీ ఇవ్వడడం ప్రలోభపెట్టడం కిందకి రాదని, ప్రతి రేప్ కేసుకు ఇది వర్తించదని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. 21 యేళ్ల యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, ఆ తర్వాత వదిలేశాడంటూ అతడిపై ఓ యువతి రేప్ కేసు పెట్టింది. దీంతో ఆ యువకుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
అతడి ముందస్తు బెయిల్‌కు అంగీకరిస్తూ జస్టిస్ మృదుల భట్కర్ ఆ విధంగా వ్యాఖ్యానించారు. ప్రేమించుకున్న జంటలు విడిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తిపై రేప్ కేసు పెట్టడం ఓ ధోరణిగా మారిపోయిందని, అయితే కోర్టులు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.

బాధితురాలి బాధలు, నిందితుడి జీవితం, స్వేచ్ఛ - ఈ రెండిటి మధ్య కోర్టులు సమతుల్యం సాధించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెళ్లికంటే ముందు తమ అంగీకారంతోనే జరిగిన శృంగారాన్ని చదువుకున్న ఆడపిల్లలెవరూ రేప్ అనరని, తద్వారా ఎదుర్కోబోయే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి ముందే తెలుసు కాబట్టి ఎవరి నిర్ణయానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
సమాజం మారుతోందని, పెళ్లి చేసుకునే వరకు మహిళ యువతిగా కన్యగా ఉండాలనే అభిప్రాయం ఉండేదని, ప్రస్తుతం యువతరం పరస్పరం విభిన్నమైన కలయికలోకి వస్తున్నారని, వారికి లైంగిక చర్యగా గురించి బాగా తెలుసునని అన్నారు. చదువుకున్న అమ్మాయి పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే అది అంగీకారంతోనే జరిగి ఉంటుందని అన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications