టిప్పు జయంతి: దర్జాగా పోర్న్ వీడియోలు చూసిన మంత్రి
బెంగళూరు: ఆయన ఓ రాష్ట్రానికి ప్రాధమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి. పైగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టిప్పు సుల్తాన్ జయంతి వేడుకుల ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఏమి చేశారంటే వింటేనే సిగ్గుగా ఉంది.
పది మందికి బుద్ధి మాటలు చెప్పాల్సిన ఆయన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో తన మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటక ప్రాధమిక, మాధ్యమిక విద్యాశాఖా మంత్రి తన్వీర్ సేఠ్ ఇప్పుడు హాట్ టాఫిక్ గా నిలిచిపోయారు.
రాయచూరులో టిప్పు సుల్తాన్ జయంతివేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రాధమిక, మాధ్యమిక విద్యాశాఖా మంత్రి తన్వీర్ సేఠ్ తన మొబైల్ ఫోన్ లో దర్జాగా పోర్న్ వీడియోలు చూస్తు మీడియాకు అడ్డంగా బుక్కయ్యారు.

ఈ వ్యవహారం అంతా కన్నడ టీవీ చానల్స్ లో ప్రసారం అయ్యింది. ఈ విషయంతో సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ విషయంపై మంత్రి తన్వీర్ సేఠ్ ను ఎందుకు మీరు పోర్న్ వీడియోలు చూస్తున్నారు అని మీడియా ప్రశ్నించింది.
ఆయన ఏమి సమాధానం చెప్పారంటే, నేను ఇల్లు వదిలి మూడు నెలలు అయ్యింది అందుకే అంటు సిగ్గు లేకుండా సమాధానం ఇచ్చారు. తరువాత మంత్రి గారు మాట మార్చారు. మైసూరుకు చెందిన తాను ఇక్కడ జరుగుతున్న టిప్పు సుల్తాన్ వేడుకల వీడియో చూస్తున్నానని సమర్థించుకున్నారు.
ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖా మంత్రి డాక్టర్ పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ పూర్తి వివరాలు సేకరించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తరువాత కులబర్గి జిల్లాలోని చించోళిలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి మంత్రి తన్వీర్ సేఠ్ బయలుదేరారు. మంత్రిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్ఝ్ దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ రాజా) నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అదేశాలు జారీ చేశారని తెలిసింది. గతంలొ అసెంబ్లీ సమావేశాల్లో కొందరు మంత్రులు, శాసన సభ్యులు ఇలాగే నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు అడ్డంగా బుక్ అయ్యిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications