సీఎం కార్యక్రమాలు మొత్తం రద్దు, టైమ్ ఫిక్స్ అయ్యిందని, ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్, చెరువుల్లో !

బెంగళూరు/కోప్పళ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం ఖరారు చేస్తామని ఎన్నికల కమీషన్ తెలిపింది. ఇప్పటికే ముందుగా ఖరారు చేసుకున్న కార్యక్రమాలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ రద్దు చేసుకున్నారు. బుధవారం (మార్చి 29వ తేదీ) పలు కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావలసిన బసవరాజ్ బోమ్మయ్ ఆ కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకున్నారు.

కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు జరగవలసి ఉండటంతో ఆ కార్యక్రమాలు రద్దు కావడంతో అక్కడి ప్రజలు నిరాశపడుతున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్నికల కమీషన్ అధికారులు తెలిపారు. ఈ దెబ్బతో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అధికారిక కార్యక్రమాలు అన్నీ రద్దు అయ్యాయి.

Effect of Assembly Election Code, All official programs of CM Basavaraj Bommai have been cancelled.

బుధవారం నుంచి కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలు కానుంది. కోప్పళ జిల్లాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పలు తాగునీటి పథకాలు, నీటి పారుదల శాఖకు చెందిన కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందుగానే ముహూర్తం ఫిక్స్ చేశారు. పలు చెరువుల్లో నీటిని నింపడానికి అన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు బుధవారం సీఎం బసవరాజ్ బోమ్మయ్ హాజరుకావలసి ఉంది.

అదే విధంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సొంత నియోజక వర్గం శిగ్లాంవితో పాటు రాణేబెన్నూరులో ఏర్పాటు చేసిన వివిద కార్యక్రమాలకు హాజరుకావలసి ఉంది. అయితే ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్ని కార్యక్రమాలు రద్దు అయ్యాయని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నందున సీఎం బసవరాజ్ బోమ్మయ్ కార్యక్రమాలు రద్దు కావడంతో బీజేపీ కార్యకర్తలు నిరాశపడ్డారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్. జేడీఎస్, కేఆర్ పీ, ఆప్ పార్టీలు సిద్దం అవుతున్నాయి. అన్ని పార్టీలకు ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ వర్థిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+