నరకం చూస్తున్నాం! కాపాడండి: 9నెలలుగా నౌకలోనే 8మంది భారత నావికులు
దుబాయ్: భారతదేశానికి చెందిన ఎనిమిది మంది నావికులు దాదాపు 9నెలలపాటు ఓ నౌకలోనే ఉంటున్నారని మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. పనామాకు చెందిన నౌక గత నవంబర్‌లో దుబాయ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది.
అప్పటి నుంచి ఆ నౌక నడిపిస్తున్న కంపెనీ అందులో పనిచేస్తున్న భారత నావికులకు సరిపడినంత ఆహారం, ఇంధనం ఇవ్వకుండా సముద్రంలోనే వదిలేసిందని గల్ఫ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వారికి పూర్తి వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని తెలిపింది.

ఎంవీ టాప్‌మ్యాన్ అనే షిప్ దుబాయ్ మారిటైం సిటీ(డీఎంసీ)లోని 13వ నెంబరు బెర్త్ వద్ద నిలిపి ఉంచారు. తాము దుబాయ్‌కి వచ్చినప్పటి నుంచి ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారని, సరిపడినంత ఆహారం, తాగునీరు సరఫరా చేయడం లేదని నౌకలోని సిబ్బంది వెల్లడించినట్లు మీడియా కథనంలో తెలిపింది.
ఇంధనం కూడా అయిపోయిందని చెప్పినట్లు వెల్లడించింది. 'మేము కేవలం బతికి ఉన్నాం. ఏడు నుంచి ఎనిమిది కిలోలు తగ్గాం. మా వద్ద శక్తి లేదు. మా కుటుంబాలు మేము తిరిగి ఎప్పుడొస్తామని ఎదురుచూస్తున్నాయి. ఇక ఆత్మహత్యే శరణ్యం' అని వారిలో ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.
యూఏఈ వీసాలు లేనందున నావికులెవ్వరూ షిప్ దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని, నౌకలో ఎంఎల్‌సీ కంప్లైంట్ సర్టిఫికెట్, అగ్నిమాపక యంత్రాలు పనిచేయడం లేదని నౌకలోని సీనియర్ నావికుడొకరు తెలిపారు. తమను ఎలాగైన స్వదేశానికి తీసుకెళ్లాలని బాధిత నావికులు వేడుకుంటున్నారు. కాగా, నావికులు, నౌక యజమానితో సంప్రదింపులు జరుపుతున్నామని భారత కాన్సులేట్ వెల్లడించింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications