పోలీస్ వ్యాన్‌ను ఢీకొన్న ట్రక్కు: 8మంది పోలీసులతోపాటు ఖైదీ మృతి
బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. పోలీస్ వ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొనడంతో పోలీస్ వ్యాన్‌లోని ఎనిమిది మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏడుగురు పోలీసులు, ఓ ఖైదీ ఉన్నారు.
సీతమర్హి: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. పోలీస్ వ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొనడంతో పోలీస్ వ్యాన్‌లోని ఎనిమిది మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏడుగురు పోలీసులు, ఓ ఖైదీ ఉన్నారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో మరికిందరు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గల్లంతయ్యారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications