ఒకేసారి ఎన్నికలకు సిద్ధం, కానీ: ఎన్నికల సంఘం
2018 సెప్టెంబర్ తర్వాత నుంచి ఒకేసారి లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.దీంతో రూ.వందల కోట్ల ఖర్చు తగ్గుతుందని ఈసీ ఓపీ రావత్ వెల్లడించారు.మధ్యప్రదే
ఢిల్లీ: 2018 సెప్టెంబర్ తర్వాత నుంచి ఒకేసారి లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రూ.వందల కోట్ల ఖర్చు తగ్గుతుందని ఈసీ ఓపీ రావత్ వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) నెట్‌వర్క్ వెబ్ యాప్‌ను రావత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడారు.

దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏం కావాలో మేం ప్రభుత్వానికి వివరించామని, ఈవీఎంలు తదితర అంశాల గురించి చర్చించామని, అంతేగాక ఇందుకు ఎంత డబ్బు అవసరమో కూడా చెప్పామని, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 40లక్షల ఎన్నికల సంబంధిత పరికరాలు కావాలన్నారు.
వీవీపాట్(వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్)ల కోసం రూ.3,400కోట్లు, ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులు అందించడంతో అదనపు పరికరాల కోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్లు రావత్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 2018 నాటికి అన్ని పరికరాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications