షాక్: ఆర్ కే నగర్ లో ఓటర్లకు ప్రత్యేక ప్యాకేజీలు, ఇలా పంచేశారు: ఈసీ !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి వినూత్న మార్గాలను అనుసరించాయని, ఆయా పార్టీల అగ్రనాయకుల సూచనలతోనే ఇలాంటివి జరిగాయని, అందుకే ఉప ఎన్నికలు వాయిదా వేశామని ఎన్నికల కమిషన్ వెలువరించిన 33
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడులోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు వినూత్న మార్గాలను అనుసరించాయని భారత ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఎన్నికల వ్యయం పరిమితుల పరిధిలోకి రాకుండా చాల జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొంది.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా సరికొత్త పద్దతుల్లో డబ్బులు పంపిణీ చేశారని అభిప్రాయపడింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ వెలువరించిన 33 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని పేర్కొంది.

అగ్రనాయకుల సూచనలు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అగ్ర నాయకుల సూచనలతోనే ఈతతంగం మొత్తం జరిగినట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. అయితే మాకు ఏమీ తెలియదని వారు చెప్పలేరని, మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

రూ. 18.80 లక్షలు, 35 కేసులు
ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఏప్రిల్ ఏడో తేదీ వరకు ఓటర్లకు పంచిపెట్టడానికి తీసుకు వెలుతున్న రూ. 18.80,700 (నగదు) పట్టుబడిందని, 35 కేసులు నమోదయినట్లు ఎన్నికల కమిషన్ వివరించింది. పలు పార్టీల కార్యకర్తలకు ఇవ్వడానికి సిద్దం చేసిన సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల కమిషన్ వివరించింది.

ఇలా మాయ చేసి ప్రలోభపెట్టారు
ఓటర్లను ఇలా ప్రలోభపెట్టారని ఎన్నికల కమిషన్ వివరించింది. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చెయ్యడం, బ్యాలెట్ పేమెంట్ ద్వారా నగదు పంపించడం, పాల ప్యాకెట్ల కొనుగోలు కూపన్లు, దిన పత్రికల చందాలు చెల్లింపు, సెల్ ఫోన్ల ప్రీపెయిడ్ కూపన్లు, నిత్యవసర వస్తువులు ఎక్కడైనా కొనుగోలు చేయడానికి వీలుగా టోకన్లు, నగదు, బహుమతులు ఇచ్చి ఓటర్లను ప్రలోభపెట్టారని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

వీరికి ప్రత్యేక ప్యాకేజీలు
ఆర్ కే నగర్ లోని ఆయా పార్టీల కార్యకర్తలను ప్రలోభపెట్టడానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చారని ఎన్నికల కమిషన్ వివరించింది. నగదు, సెల్ ఫోన్లు, వెండి పళ్లాలు, ఖరీదైన చీరలు, ఖరీదైన ల్యాంపులు, స్మార్ట్ సెల్ ఫోన్లు, ఇతర బహుమతులు ఇచ్చారని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

టోకన్లు, కోడ్ గుర్తులే కీలకం
ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న టోకన్లు, కోడ్ గుర్తులు ఉన్న కాగితాలను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. టోకన్లు ఎవరు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పంచిపెట్టారు అంటూ ఎన్నికల అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications