శశికళ ఫ్యామిలీకి భారీ దెబ్బ: క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్, దినకరన్ కు ఆ పదవి, పండగ !

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ పగ్గాలు చేపట్టి తమిళనాడు ప్రభుత్వాన్ని ఆడుకోవాలని ప్రయత్నిస్తున్న శశికళ నటరాజన్ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు పెద్ద ఎదురు దెబ్బ తగలింది.

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ పగ్గాలు చేపట్టి తమిళనాడు ప్రభుత్వాన్ని ఆడుకోవాలని ప్రయత్నిస్తున్న శశికళ నటరాజన్ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు పెద్ద ఎదురు దెబ్బ తగలింది. అసలు ఆయన అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు ఎలా చేపడుతారు ? అనే ప్రశ్న ఇప్పుడు మొదలైయ్యింది.

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లే సమయంలో శశికళ నటరాజన్ అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా తన సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసి జైలుకెళ్లారు.

రెండాకుల చిహ్నం కోసం

రెండాకుల చిహ్నం కోసం

అన్నాడీఎంకే పార్టీ చిహ్నం రెండాకుల గుర్తు మాకే కావాలని, లేదు మాకే కావాలని పన్నీర్ సెల్వం, శశికళ వర్గం ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. రెండాకుల చిహ్నం ఎవ్వరికీ కేటాయించకుండా ఎన్నికల కమిషన్ ఇప్పటికే పెండింగ్ లో పెట్టింది.

టీటీవీ దినకరన్ డెడ్ లైల్

టీటీవీ దినకరన్ డెడ్ లైల్

రెండాకుల చిహ్నం వివాదం ఎన్నికల కమిషన్ దగ్గర ఉంది. తాను పెట్టిన రెండు నెలల డెడ్ లైన్ గడుపు పూర్తి అయ్యిందని ఆగస్టు 5వ తేదీ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం చేరుకుని పార్టీ పగ్గాలు చేపడుతానని టీటీవీ దినకరన్ పదేపదే చెబుతున్నాడు.

ఆర్ టీఐ కార్యకర్త

ఆర్ టీఐ కార్యకర్త

సామాజిక కార్యకర్త (ఆర్ టీఐ కార్యకర్త) ఒకరు అన్నాడీఎంకే పార్టీ డిప్యూటి ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఉన్నారా ? లేరా ? అంటూ భారత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. సామాజిక కార్యకర్త అర్జీ పరిశీలించిన భారత ఎన్నికల కమిషన్ టీటీవీ దినకరన్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.

దినకరన్ కు అంత సీన్ లేదు

దినకరన్ కు అంత సీన్ లేదు

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కాదని శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వడంతో శశికళ కుటుంబ సభ్యుల దిమ్మతిరిగిపోయింది. స్వయంగా భారత ఎన్నికల కమిషన్ దినకరన్ కు ఆ పదవి లేదని సమాచారం ఇవ్వడంతో టీటీవీ దినకరన్ వర్గీయులు అయోమయంలో పడిపోయారు.

నిత్యం భజన

నిత్యం భజన

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ అధికార ప్రతినిధి, ప్రతినిత్యం శశికళ, టీటీవీ దినకరన్ భజన చేస్తున్న నాజిల్ సంపత్ శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. టీటీవీ దినకరన్ త్వరలోనే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు.

ఆయన్నే అడగండి

ఆయన్నే అడగండి

ఆగస్టు 5వ తేదీ శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారా ? లేదా ? అని మీడియా అంటే ఆ విషయం ఆయన్నే అడగాలని నాజిల్ సంపత్ చిన్నగా తప్పించుకున్నారు. మొత్తం మీద టీటీవీ దినకరన్ కు మళ్లీ కష్టాలు మొదలైనాయని అంటున్నారు.

పండగ చేసుకుంటున్నారు

పండగ చేసుకుంటున్నారు

టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి కాదని స్వయంగా భారత ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చిందని తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గం ఆనందంలో మునిగిపోయి పండగ చేసుకుంటున్నారు. అయితే నిత్యం తిక్కచేష్టలు చేసే టీటీవీ దినకరన్ ఇప్పుడు ఏం చేస్తాడో ? అని తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+