రాహుల్ గాంధీ 'ఓట్ల చోరీ' వ్యాఖ్యలపై ఈసీ సీరియస్..

దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కర్ణాటకలో ఎన్నికల సమయంలోనూ ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. త్వరలోనే ఆ వివరాలను ప్రజల ముందు ఎన్నికల కమిషన్ ముందు ఉంచుతామని తెలిపారు. ఈసీ ఓట్లను చోరీ చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టింది. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలను చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా అభివర్ణించింది.

రోజూ ఈసీ పై ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేస్తున్నారని ఆ వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని ఈసీ స్పష్టం చేసింది. తాము దేశ ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తున్నామని.. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఈ మేరకు ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాహుల్ గాంధీ మరోసారి ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలోని టాప్ టూ బాటమ్ అధికారులను వదలమని.. వాళ్లంతా ఇందులో పాత్రులేనని తెలిపారు. ఈసీ అక్రమాలపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా కోటికి పైగా ఓట్లను చేర్చారని.. అందుకే ఈసీ అక్రమాలపై 6 నెలల నుంచి దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఎన్నికల సంఘం అక్రమాలపై అణుబాంబు లాంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆ అణు బాంబులు పేలితే అసలు ఎన్నికల సంఘమే ఉండదంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో అక్రమాలకు పాల్పడిన అధికారిది ఏ స్థాయి అయినా వదిలేది లేదన్నారు.

Election Commission Slams Rahul Gandhi s Baseless Vote Theft Allegations

ఇక బీహార్ రాష్ట్రం ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ఇటీవల తెలిపింది. బీహార్​ లో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు మరణించారు. 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్​ తెలిపింది. మరో 7 లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు ఈసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించనున్నట్లు తెలిపింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆగస్టు 1న ప్రచురించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+