ఎన్నికల కమిషనర్ లావాసా రాజీనామా - సీఈసీ చాన్స్ వదులుకుని ఏడీబీలోకి - గతంలో మోదీపై విభేదాలు

త్రిసభ్య ఎన్నికల సంఘంలో తొలిసారి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాసా రాజీనామా చేశారు. ఆగస్టు 31 లోగా తనను రిలీవ్ చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఆయన రాజీనామా లేఖ పంపారు. లావాసా పదవీ కాలం 2022వరకు ఉన్నా.. సునీల్ అరోరా తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) అయ్యే అవకాశమున్నా కాదనుకునిమరీ ఎన్నికల సంఘం నుంచి ఆయన తప్పుకుంటుండటం గమనార్హం.

1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అశోక్ లావాసాను ఈసీ నుంచి తప్పించి, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం జులై 15న ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఏడీబీ ఉపాధ్యక్షుడిగా ఉన్న దివాకర్ గుప్తా పదవీ కాలం ఈనెల 31తో ముగియనుంది. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలో ఆ పదవిలో చేరేలా.. ఈసీ నుంచి రిలీవ్ చేయాలంటూ లావాసా రాజీనామా లేఖ రాశారు.

Election Commissioner Ashok Lavasa resigns, set to join ADB

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నియమావళిని ఉల్లఘించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి బీజేపీ చీఫ్ అమిత్ షాలపై ఆరోపణలు రాగా, వాళ్లపై చర్యల విషయంలో అశోక్‌ లావాస నిక్కచ్చిగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై త్రిసభ్య ఎన్నికల సంఘంలో తీవ్రస్థాయి విభేదాలు కూడా తలెత్తాయి. తర్వాతి కాలంలో లావాసా కుటుంబీకులపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. వరుస పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి తప్పుకోవడమే మంచిదని ఆయన భావించారని, ఆమేరకు ఏడీబీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది.

Election Commissioner Ashok Lavasa resigns, set to join ADB

ప్రస్తుత సీఈసీ సునీల్ అరోరా 2021లో రిటైర్ కానున్నారు. లావాసా రాజీనామాతో తదుపరి సీఈసీగా సుశీల్‌ చంద్రగత బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, అశోక్ లావాసా రాజీనామాతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన ఖాళీని ఎవరితో భర్తీ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+