ఈసీ అశోక్ లావాసా భార్య ఆదాయంపై ఐటీ శాఖ నజర్ : నోటీసులు జారీ

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాసా భార్య నోవల్ సింఘాల్ లావాసా ఆదాయంపై ఐటీ విభాగం దృష్టిసారించింది. ఆమె ఆదాయంలో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆదాయంలో తేడా ఉందా ? ఐటీ రిటర్న్ తప్పుగా ఫైల్ చేశారా అని నోటీసులు కూడా జారీచేసింది. ఆమె ఆదాయ, వ్యయాలపై గత కొన్నిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తోంది.

నోవల్ సింఘాల్ లావాసా.. 2005 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. అప్పటివరకు నోవాల్ రిటర్నులపై ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. కానీ గత కొన్ని నెలలుగా మాత్రం భారీ తేడాను ఐటీ అధికారులు గుర్తించారు. ఆదాయ, వ్యయాల్లో తేడాకు గల కారణం ఏంటని ఇటీవల నోటీసులు కూడా జారీచేశారు.

Election Commissioner Ashok Lavasas wife under IT scanner

ఆదాయంలో ఎందుకు వ్యత్యాసం వస్తుందని ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. పన్ను ఎగవేశారా ? అని ఆరాతీస్తున్నారు. 2015 నుంచి 2017 వరకు వివిధ కంపెనీలకు నోవాల్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో అక్రమంగా ఆదాయం కూడబెట్టారా అని ఆరాతీస్తున్నారు. మరోవైపు గతేడాది జనవరి 23న అశోక్ కేంద్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసి .. పదవీ విరమణ చేశారు.

గత లోక్‌సభ ఎన్నికల సమయంలో అశోక్ .. ప్రధాని మోడీ, అమిత్ షా పట్ల సానుకూలం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మోడీ, షా చేసిన కామెంట్లకు క్లీన్ చీట్ ఇచ్చారు. మోడీ 4 సభలు, అమిత్ షా ఒక సభలో మాట్లాడిన అంశానికి క్లీన్ చీట్ ఇచ్చారు. మరోవైపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ చంద్రతో విభేదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+