ఇంటికే ఈవీఎంలు, దర్జాగా ఓట్లు వెయ్యడానికి సర్వం సిద్దం, లక్షల ఓట్లు !

బెంగళూరు/న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందిరి బాధ్యత అని ఇప్పటికే ఎన్నికల కమీషన్ అధికారులు ప్రజలకు చాటి చెబుతున్నారు. వయసు మీదపడి ఓటింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వెయ్యలేక చాలా మంది సీనియర్ సిటిజన్లు ఇబ్బంది పడుతున్నారు. నడవలేని వాళ్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారు నివాసం ఉంటున్న ఇళ్లకే ఈవీఎం యాంత్రాలు తీసుకెలుతున్నారు.

ఎన్నికల అధికారులు మొట్టమొదటి సారిగా ఇళ్లకే ఈవీఎం యంత్రాలు తీసుకెళ్లి సీనియర్ సిటిజన్ల దగ్గర ఓటు వేయించడానికి సిద్దం అయ్యారు. బెంగళూరు నగరంలోని బీబీఎంపీ పరిధిలో నివాసం ఉంటున్న 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల దగ్గర ఓటు వేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

 Election officials

పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వెయ్యలేని వాళ్లు ఏప్రిల్ 17వ తేదీ లోపు వారి పేర్లు నమోదు చేసుకోవాలని బీబీఎంపీ అధికారులు మనవి చేశారు. బెంగళూరు నగరంలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 2. 36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కర్ణాటకలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 12 లక్షల మంది ఉన్నారని ఎన్నికల అధికారులు ఉన్నారు.

బెంగళూరులో (బీబీఎంపీ)పరిధిలో తాము ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటామని 80 ఏళ్లు దాటిన ఓటర్లలో 8, 611 మంది వారి పేర్లు నమోదు చేసుకున్నారు. వీరితో పాటు 119 మంది అంగవికలాంగులు వారి పేర్లు నమోదు చేసుకున్నారు. మే 10వ తేదీ కంటే నాలుగు రోజుల ముందు నుంచి ఈ ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు, బీబీఎంపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Election officials

గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటిన చాలా మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారని అధికారులు అంటున్నారు .అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటిన ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారి దగ్గరకే ఈవీఎం యంత్రాలు తీసుకెళ్లాలని బీబీఎంపీ అధికారులు, ఎన్నికల అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+