Electric Scooter: పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధ్వంసమైన ఇల్లు..
ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఇల్లు కూలిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. లక్నోలోని చౌక్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఛార్జ్ చేస్తుండగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగి పేలిపోవడంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైందని పోలీసు అధికారులు గురువారం తెలిపారు. స్కూటీతో పాటు లక్షల విలువైన వస్తువులు కూడా అగ్నికి ఆహుతి కాగా, నలుగురు సభ్యులున్న కుటుంబం సురక్షితంగా బయటపడ్డారు. ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్ నిగమ్ రోడ్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ నసీమ్ ఇంట్లో ఈ ఘటన జరిగింది అని అగ్నిమాపక స్టేషన్ అధికారి చౌక్‌లోని పుష్పేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
"ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నట్లు సమాచారం అందిన వెంటనే, రెండు ఫైర్ టెండర్లను పంపించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు' అని ఆయన తెలిపారు. పేలిన స్కూటర్ చైనీస్ కంపెనీకి చెందినది అని చెప్పారు. ఆ స్కూటర్ ను ఏడాదిన్నర క్రితం రూ.65వేలకు కొనుగోలు చేశానని మహ్మద్ నసీమ్ తెలిపాడు.

"మేము భారీ శబ్దం విన్నప్పటికీ పేలుడు జరిగిందా లేదా అది కాలిపోయిందా అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. నేను మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో స్కూటీకి ఛార్జ్‌లో పెట్టాను. కానీ కొన్ని గంటల తర్వాత నేను మెట్లు దిగి వచ్చేసరికి పొగ, మంటలు కనిపించాయి. కాబట్టి, నేను వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయం తీసుకున్నాను. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాను"అని నసీమ్ చెప్పాడు.
"నేను ఎప్పుడూ బ్యాటరీ స్కూటర్‌నే ఉపయోగిస్తాను. నేను బ్యాటరీ స్కూటర్లకు మారి 15 ఏళ్లు అయింది. ఇంతకుముందు స్కూటర్లు భారతీయ బ్రాండ్లకు చెందినవి. కానీ ఈసారి నేను ఈ చైనీస్ స్కూటీని కొనుగోలు చేసాను, అది ఒక సంవత్సరం మాత్రమే బ్యాటరీ వారంటీని కలిగి ఉంది" అని పేర్కొన్నారు. వెడేక్కడం వల్లే బ్యాటరీ పేలినట్లు అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. గతంలో కూడా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలి మనుషులు చనిపోయిన ఉందతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తలతో బ్రాండ్ కంపెనీలు ఎలక్ట్రికి స్కూటర్లు తీసుకొస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications