ప్రియాంక హామీలు: కరెంట్ బిల్లు మాఫీ, 20 లక్షల సర్కార్ కొలువులు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రధాన పార్టీలు హామీలు ఇస్తున్నాయి. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ మూడు 'ప్రతిగ్య యాత్రలు' ప్రారంభించారు. వేర్వేరు మార్గాల గుండా ఈ యాత్రలు ప్రారంభం అవుతాయి. ఒకటి బారాబంకి నుంచి బుందేల్‌ఖండ్, రెండోది సహరాన్‌పూర్ నుంచి మథుర, మూడోది వారణాసి నుంచి రాయబరేలి చేరుకుంటాయి. నవంబరు 1 వరకు ఇవి కొనసాగుతాయి.

ప్రియాంక హామీలుు

ప్రియాంక హామీలుు

బారాబంకిలో యాత్ర ప్రారంభం సందర్భంగా ప్రియాంక మాట్లాడారు. ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే రుణమాఫీ, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యుత్ బిల్లుల మాఫీ, కరోనా బాధితులకు రూ. 25 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రియాంక గాంధీ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 12వ తరగతి విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారికి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రియాంక తాజాగా ప్రకటించారు.

రైతులు అంటే చులకన

రైతులు అంటే చులకన

ఇటీవలి లఖింపూర్ ఖేరీ ఘటనపై స్పందించారు. కేంద్రమంత్రి కుమారుడు వాహనంతో రైతులను తొక్కించి చంపేశాడని, అతడిని అరెస్ట్ చేయడంలో చాలా రోజులపాటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. దీనిని బట్టి ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రాధాన్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

ఫోన్లు, స్కూటీ

ఫోన్లు, స్కూటీ

12వ తరగతి విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చదువుతున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు రుణాల మాఫీ చేస్తానని ప్రియాంక చెప్పారు. చత్తీస్‌గఢ్‌ మాదిరిగా యూపీలో గోధుమలు, వరికి రూ. 2500 ధర, చెరకు క్వింటాల్‌కు రూ. 400 మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. కరోనా సమయంలో విద్యుత్ బిల్లుల పూర్తిగా మాఫీ చేస్తానని ప్రకటించారు. ప్రతి ఒక్కరి బిల్లు సగానికి తగ్గిస్తానని పేర్కొన్నారు. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలకు రూ. 25 వేల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+