ఇదీ మీకు తెలుసా.., ఎలక్ట్రానిక్ వోచర్లతో టీకా, ఎవరికీ .. ఎలా వాడాలంటే
కరోనాకు టీకాతోనె చెక్ పెట్టాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.150 ఇచ్చి వేసుకోవాలని కోరారు. అయితే సర్కార్ దవాఖానల్లో టీకాలు అయిపోతే.. పేదల సంగతి ఏంటీ అనే అంశం తెరపైకి వచ్చింది. అయితే వారికి ఎలక్ట్రానిక్ వోచర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి.

ఈవో.. ఎలా యూజ్ చేయాలి..
లోక్ కల్యాణ్ కింద ఎలక్ట్రానిక్ వోచర్లను పేదలకు అందజేస్తారు. అర్హులయిన పేదలు వాటిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి రీడిమ్ చేసుకోవాలి. దీంతో వారు ఉచితంగానే వ్యాక్సిన్ వేసుకోగలుగుతారు. ఇదీ పేదలకు మేలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వోచర్ల గురించి పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం తెలియజేయలేదు. కానీ మొబైల్ ఫోన్‌లో వోచర్ డౌన్ లోడ్ చేసుకోవాలని మాత్రం తెలుస్తోంది. దానిని వ్యాక్సిన్ సెంటర్లలో స్కాన్ చేసి.. వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.

అర్హులే వాడాలీ..
అయితే ఇదీ నాన్ ట్రాన్స్‌ఫరబుల్ అంటే.. ఎవరికీ ఆ వోచర్ వచ్చిందో.. వారు మాత్రమే యూజ్ చేయవచ్చు.పేదలకు వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పస్టంచేసింది. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు మాత్రం.. డబ్బులు కట్టి టీకా తీసుకోవాలని కోరింది. అందరికీ వ్యాక్సిన్ అనే అంశాన్ని అన్నీ పార్టీలు, నేతలు స్వాగతించారు. కొంత విమర్శలు వ్యక్తమయినా.. ఇప్పటికైనా కళ్లు తెరిచారా అంటూ కామెంట్స్ చేశారు.

అందరికీ టీకా
ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీకి నిన్న ప్రకటించారు. దేశ హితం కోసం ప్రధాని మోడీ మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారనే కామెంట్స్ వచ్చాయి. కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని మోడీ ప్రకటించారు. ఎంత ఖర్చయిన సరే దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించడమే తన లక్ష్యం అని మోడీ ప్రకటించారని.. ఇదీ ఆయన గొప్పతననానికి నిదర్శనం అని ప్రశంసలు వచ్చాయి.












Click it and Unblock the Notifications