వీడియో వైరల్: ఆర్మీ క్యాంటీన్‌లో అనుకోని అతిథి.. గజగజ వణికిన సిబ్బంది

బెంగాల్ : బెంగాల్‌లో ఓ ఆర్మీ క్యాంటీన్‌లోకి అనుకోని అతిథి ఒకరు వచ్చారు. ఆకలైందో ఏమో ఏదో తినేందుకు వచ్చారు. అయితే ఆ అతిథిని చూడగానే లోపల ఉన్న మిగతావారు భయపడ్డారు. పరుగులు తీశారు. కానీ ఈ అతిథి మాత్రం చాలా కూల్‌గా నడుచుకుంటూ క్యాంటీన్ లోకి అడుగు పెట్టారు. ఇంతకీ ఆ అతిథి ఎవరు..? ఎందుకు ఆ ఆర్మీ క్యాంటీన్‌కు వచ్చారు..?

ఆర్మీ క్యాంటీన్‌లో గజరాజు

పశ్చిమబెంగాల్‌లోని దూఆర్స్‌లో ఉండే హసిమారా ఆర్మీ క్యాంటీన్ ఎప్పటిలానే తెరుచుకుంది. ఇక అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా అనుకోకుండా ఓ అతిథి వచ్చింది. ఒక్కసారిగా టేబుల్స్ శబ్దం, ప్లేట్లు కిందపడుతుండటంతో ఎవరై ఉంటారా అని చూసినవారు షాక్ తిన్నారు. క్యాంటీన్‌లోకి ఓ పెద్ద గజరాజు ఎంట్రీ ఇచ్చింది. క్యాంటీన్‌లోకి అడుగు పెట్టడంతోనే అక్కడ ఉన్న బల్లలను, గ్లాసులను, ప్లేట్లను కిందకు తోసేసింది. కుర్చీలను సైతం విరగొట్టింది. ఇక ఆ ఏనుగును ప్రతిఘటించే సాహసం ఎవరూ చేయలేదు. అంతా భయంతో వెనక్కు వెళ్లి దాక్కున్నారు.

ఏనుగు బీభత్సం

ఏనుగు బీభత్సం

ఏనుగును భయపెట్టేందుకు ప్రయత్నించిన సిబ్బంది
ఇక దాక్కున్న వారిని చూసిన ఏనుగు వారిపైకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇక చేసేదేమీ లేక ఓ కార్డుకు మంటపెట్టి గజరాజును భయపెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించింది. కానీ అది ఒక్క అడుగుకూడా వెనక్కువేయలేదు. ఇక ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో సిబ్బంది చేసేదేమీ లేక ఆ ఏనుగును అలానే చూస్తుండి పోయారు. ఆ గజరాజు మాత్రం క్యాంటీన్‌ లోపలకు పెద్దగా ఘీంకరిస్తూ వెళ్లిపోయింది. ఇలా లోపలికి వెళుతుండగానే మరో వ్యక్తి మళ్లీ ఓ కట్టెకు నిప్పు అంటించి ఏనుగును భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈసారి మాత్రం భయపడింది. వెనక్కు తిరిగి బయటకు వెళ్లిపోయింది.ఇక ఆ అగ్ని కలిగిన కట్టెతోనే అది బయటకు వెళ్లిపోయేవరకు దాని వెంట పడ్డారు.

 ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఏనుగులు

ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఏనుగులు

ఈశాన్య ప్రాంతంలోని డూఆర్స్‌ మొత్తం టీ గార్డెన్స్‌తో ఉంటుంది. హసిమారాలోని ఆర్మీ క్యాంటీన్ ఉన్న ప్రాంతం చిలపటా అడవులకు కూతవేటు దూరంలో ఉంటుంది. దీంతో అక్కడ ఏనుగుల సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యే ఓ ఏనుగు నివాస ప్రాంతాల్లోకి వెళ్లిన వార్తలు కూడా వచ్చాయి. ఇక భూటాన్ హసిమారా ప్రాంతం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+