దసరా ఊరేగింపులో ఏనుగు హల్ చల్.. పరుగులు తీసిన జనం.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే దసరా ఉత్సవాలు అంటే ముందుగా అందరికీ కర్ణాటక గుర్తొస్తుంది. కర్ణాటకలో దశాబ్దాలుగా దసరా పండగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శివ మొగ్గలోని దసరా ఉత్సవాల్లో షాకింగ్ ఘటన జరిగింది. ఇక్కడ దసరా పండగ సందర్భంగా ఏనుగుపై దేవుడిని ఊరేగించేందుకు ప్రయత్నించారు. అలాగే సుమారు 650 కిలోల బరువున్న వెండి మండపాన్ని ఆ ఏనుగుపై ఉంచారు. అయితే ఆ ఏనుగు అదుపు తప్పింది. ఒక్కసారిగా పరుగులు తీస్తూ అక్కడ బీభత్సం సృష్టించింది. ఏనుగు ధాటికి పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతేకాక అంబారీలోని చాముండేశ్వరి దేవి విగ్రహం కింద పడిపోయి దెబ్బతింది.

దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఊరేగింపులో బీభత్సం సృష్టించిన సోమన్న అనే ఏనుగును అదుపు చేసేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. చాలాసేపు ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ ఏనుగుకు మత్తు మందు ఇచ్చి అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఆ ఏనుగు నియంత్రణలోకి వచ్చింది. మరోవైపు శివమొగ్గ జిల్లా ఎస్పీ, డివిజనల్ ఫారెస్ట్ అధికారి సంఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. ఇక ప్రస్తుతం ఆ ఏనుగు సురక్షితంగా కోట సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కోలుకుంటోంది.

Elephant goes on a rampage during Dasara procession people scramble to flee video goes viral now

ఇక ఈ ఊరేగింపులో సోమన్న ఏనుగుతో పాటు సాగర్, బహదూర్ అనే మరో రెండు ఏనుగులు కూడా పాల్గొన్నాయి. ఇక ఏటా సాగర్ అనే ఏనుగే ఈ అంబారీని మోసేది.. కానీ ఈసారి దానికి కాలు నొప్పి రావడంతో చివరి నిమిషంలో సోమన్న పైకి అంబారీ చేరింది. అయితే ఊరేగింపులో భారీ శబ్దాలతో పాటలు, జనాల అత్యుత్సాహం, కేకలు, అరుపులతో ఏనుగు బెదిరి బీభత్సం సృష్టించేందుకు కారణం అయిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+