ఆసియాలో పెద్ద దంతాలు గల ఏనుగు: కబినీ కన్నుమూత
ఆసియాలోనే పెద్ద దంతాలు గల ఏనుగు భోగేశ్వర చనిపోయింది. అదీ కబినీగా పేరు పొందింది. దాని వయస్సు 60 అని వివరించారు. అటవీ శాఖ అధికారి సుశంత నందా ట్వీట్ చేశారు. అనారోగ్య కారణాలతో అదీ చనిపోయిందని వెల్లడించారు. ఇదీ ఎక్కువగా బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో కనిపించేది. ఇప్పుడు తిరిగి రానీ లోకాకుల వెళ్లిపోయింది.
కబినీ దంతాలు చాలా పెద్దగా ఉంటాయి. 2.58 మీటర్లు, 2.35 మీటర్లుగా ఉండేవి. కబినీ చనిపోయాడని తెలిసి పర్యాటకులు బాధపడ్డారు. కేంద్ర మంత్రి శోభ కరందాజే కూడా బాధగా ఉందన్నారు. ఏనుగు దంతాలు పర్యాటకులు, ప్రకృతి ప్రియుల దృష్టిని ఆకర్షించిందని పేర్కొన్నారు. ఇప్పుడు లేకుండా పోయిందని ఒకింత బాధతో చెప్పారు.

అడవీలో గజరాజు ప్రత్యేకం.. భారీ కాయంతో రాజుగా వెలుగొందుతాయి. అయితే పులులు, సింహాలకు మాత్రం రాజుగా పేరు వచ్చింది. ఏనుగు శాంతంగా ఉంటే ఓకే కానీ.. దానికి కోపం వస్తే.. తొండంతోనే ఆటాడిస్తాయి. కానీ చాలా ఏనుగులను మావిటిలు సాదుకుంటారు. వాటిని ఊరూరా తిప్పుతూ జీవనం పొందుతారు. వాటికి కూడా సరయిన ఆహారం అందించేవారు. ఎక్కువగా శ్రీకాకుళం పరిసరాలు.. బెంగాల్‌లో పరిసరాల్లో ఇప్పటికీ ఏనుగుల గుంపు ఉంటాయి. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో కూడా పండు ముసలి ఏనుగులు కనిపించేవి.












Click it and Unblock the Notifications