అలర్ట్ మెసేజ్‌తో దేశ వ్యాప్తంగా మోత మోగిన ఫోన్లు.. మీకు వచ్చిందా ??

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫోన్లు గట్టిగా మోగాయి. 11:46 నిమిషాలకు స్క్రీన్‌పై మెరుస్తూ కనిపించిన అలర్ట్ మెసేజ్... చాలా మందిని కాసేపు ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా పెద్ద శబ్దంతో ఫోన్ మోగడం, స్క్రీన్‌పై ఫ్లాష్ మెసేజ్ కనిపించడం ఈ సిస్టమ్ యొక్క ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఇది ఎలాంటి ప్రమాద సూచన కాదని.. ముందుగా ప్రకటించినట్లుగానే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పరీక్ష అని తెలుస్తోంది. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు క్షణాల్లో సమాచారం చేరవేయడం లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్' (Cell Broadcast Alert) సిస్టమ్‌ను పరీక్షించింది.

కాగా National Disaster Management Authority (NDMA) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించగా, లక్షలాది మొబైల్ వినియోగదారులకు ఒకేసారి అలర్ట్ సందేశాలు పంపబడ్డాయి. ఈ సందేశాలు గట్టిగా బీప్ సౌండ్ లేదా అలారం టోన్‌తో రావడం వల్ల చాలామందికి ఇది నిజమైన అత్యవసర పరిస్థితిలా అనిపించింది. ఈ అలర్ట్‌లో స్పష్టంగా "ఇది కేవలం టెస్ట్ మాత్రమే, ఎలాంటి చర్య అవసరం లేదు, భయపడవద్దు" అని పేర్కొన్నారు. అయినప్పటికీ అకస్మాత్తుగా వచ్చిన ఈ హెచ్చరిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

emergency-alert-by-central-government-to-all-mobiles-in-india-for-natural-disasters-test

ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థను స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. Centre for Development of Telematics రూపొందించిన 'SACHET' (National Disaster Alert Portal) ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ అలర్ట్‌లు పంపబడుతున్నాయి. ఇది International Telecommunication Union సూచించిన Common Alerting Protocol (CAP) ప్రమాణాలపై పనిచేస్తుంది. అందువల్ల ఈ వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం విశేషం.

సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే-ఇది సాధారణ SMS లాగా కాకుండా, ఒకేసారి లక్షలాది ఫోన్‌లకు నెట్‌వర్క్ ద్వారా నేరుగా సందేశాన్ని పంపుతుంది. ముఖ్యంగా, ప్రమాదం సంభవించే ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు మాత్రమే ఈ హెచ్చరికలు చేరేలా డిజైన్ చేయబడింది. దీంతో సునామీలు, భూకంపాలు, పిడుగులు, గ్యాస్ లీక్‌లు, రసాయన ప్రమాదాలు వంటి పరిస్థితుల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం సాధ్యమవుతుంది.

ప్రస్తుతం ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా పరీక్షల దశలో ఉంది. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత, ఇది అనేక భారతీయ భాషల్లో హెచ్చరికలను పంపగలదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగంగా సమాచారం చేరేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇంటర్నెట్ అవసరం లేకుండానే పనిచేయడం ఈ సిస్టమ్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్. యూజర్ల ఫోన్‌లలో ఈ అలర్ట్‌లు కనిపించాలంటే 'Wireless Emergency Alerts' సెట్టింగ్స్ ఎనేబుల్ చేసి ఉండాలి. అవసరమైతే యూజర్లు ఈ టెస్ట్ అలర్ట్‌లను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే, నిజమైన అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+