12-17 ఏళ్లవారికి కొవొవాక్స్‌ టీకా : నిపుణుల కమిటీ సిఫార్సు - నాలుగో టీకాగా..!!

కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ల పైన కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. డిసెంబర్ చివర.. జనవరి నెలలో టెన్షన్ పెట్టిన ఓమిక్రాన్ కరోనా వేరియంట్ ఇప్పుడు పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. అయితే, జూన్ లో మరోసారి కరోనా వేరియంట్ కొత్త రూపుతో వ్యాపించవచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..దేశంలో ఇప్పటికే భారీగా నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో అడుగు పడింది.సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవొవాక్స్ టీకాను 12 నుంచి 17 ఏళ్ల వయసు వారికి అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వవచ్చని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

Recommended Video

    COVID 19 Vaccination: Centre's New Rule Including Precaution Dose | Oneindia Telugu

    దీనిని డీసీజీఐ ఆమోదించాల్సి ఉంది. డీసీజీఐ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు వస్తే.. కొవొవాక్స్​ 12-17 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు ఇచ్చే నాలుగో టీకా అవుతుంది. కరోనా సమయంలో దేశీయ టీకాలు కోవాగ్జిన్ .. కోవీషీల్డ్ అందించారు. ఇక, యూకే కు చెందిన వ్యాక్సిన్లకు అనుమతి లభించింది. కొవొవాక్స్ ను పెద్దలకు వేసేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) గత ఏడాది డిసెంబరు 28న నియంత్రిత అత్యవసర వినియోగ అనుమతినిచ్చింది. అయితే, మనదేశ టీకా కార్యక్రమంలో ఈ వ్యాక్సిన్‌ను ఇంకా చేర్చలేదు.

    emergency use authorisation to Serum India of India’s COVID-19 vaccine Covovax for the age group 12-17

    12-17ఏళ్ల వారికి కూడా కొవొవాక్స్‌ను సిఫార్సు చేసేందుకు అనుమతించాల్సిందిగా సీరమ్‌ సంస్థ ఫిబ్రవరి 21న దరఖాస్తు చేసింది. దీనిని పరిశీలించిన నిపుణుల కమిటీ అత్యవసర వినియోగ అనుమతికి సిఫార్సు చేసింది. ఇక, దేశంలో రోజు వారీ కరోనా పాజిటివ్ కేసులు జనవరిలో మూడు లక్షలకు పైగా నమోదు కాగా..ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. పది వేలకు దిగువ కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య తగ్గటంతో ప్రభుత్వాలు..సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

    అన్ని రాష్ట్రాలు కరోనా ఆంక్షలను ఎత్తివేశాయి. కానీ, మాస్కు వినియోగం మాత్రం కొనసాగించాలని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడా కరోనా తీవ్రత ఉన్నట్లుగా సమాచారం లేదు. అయితే, మాస్కు వినియోగం.. వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే కరోనాను పూర్తిగా నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బూస్టర్ డోసుల పంపిణీ సాగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+