యాసిడ్ దాడితో విలవిల.. ముఖానికి 17 సర్జరీలు.. ఒక్క రాంగ్ కాల్ తో లైఫ్ ఛేంజ్
అప్పటివరకూ ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిన ఆ యువతి.. ఒక్క క్షణంలో జీవితం తలకిందులుగా మారింది. యాసిడ్ దాడి ఆమె జీవితాన్ని నాశనం చేసింది. 17 సర్జరీలు చేసినా ఆమె తన ముఖాన్ని తిరిగి పొందలేక పోయింది. బయటకు వెళ్లలేని పరిస్థితి.. కొందరు ఆమెను చూసి జాలి పడుతుంటే..మరికొందరు చూసి నవ్వుకునే వారు.అయినా ఎందుకు బతికున్నానా..? అని బాధపడలేదు. జీవితం పెట్టిన పరీక్షలన్నింటినీ తట్టుకుని నిలబడింది. చివరికి తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తోంది. ఈమె కథ ఎందరో యువతీయువకులకు స్ఫూర్తి నిస్తోంది.
లైఫ్ ను మార్చిన రాంగ్ నంబర్..
ఆమె పేరు లలితా బాన్సీ. ఈమెది ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజామ్ గఢ్. 2012లో ఓ ఫంక్షన్ లో తన సోదరుడు ఆమెతో గొడవ పెట్టుకుని ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెకు 17 సర్జరీలు అయ్యాయి. అయినా తన ముఖం తిరిగి సాధారణ స్థితికి రాలేదు. దీంతో మార్పు కోసం ఆమె తన సొంత గ్రామం ఆజామ్ గఢ్ ను వదిలి మహారాష్ట్రలోని థానే కు వచ్చింది. ఓ రోజు లలిత రాంగ్ కాల్ చేసింది. ఒకరికి చేయాల్సిన కాల్.. నెంబర్ తప్పుగా ఎంటర్ చేయడంతో మరొకరికి వెళ్లింది. మొదట ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ ఆ నెంబర్ నుండి లలితా బాన్సీ కు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు మలాద్ లో సీసీటీవీ ఆపరేటర్ గా పనిచేస్తున్న రవి శంకర్ సింగ్. లలితా బాన్సీతో మాటలు కలిపాడు శంకర్. లలిత వాయిస్ నచ్చడంతో ఆమెతో రోజూ శంకర్ మాట్లాడేవాడు.

అయితే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సమీపిస్తున్న క్రమంలో.. లలితా బాన్సీ వద్దకు కొన్ని నేషనల్ మీడియ ఛానల్స్ ఇంటర్వ్యూ చేసాయి. మరోసారి ఆమె మాటలు అందరినీ కలచివేశాయి. " అద్భుతాలు జరగడం అంటే ఇదేనేమో. యాసిడ్ బాధితురాలిని. 17 సార్లు సర్జరీ అయింది. నాకూ లవ్ దొరుకుందని నేను అనుకోలేదు. కానీ అది జరిగింది. ఇదంతా ఆ రాంగ్ కాల్ వల్లనే. ప్రేమను నమ్మాలని శంకర్ నాకు చెప్పాడు.ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాం" అని లలితా బాన్సీ ఎమోషనల్ అయింది.
ఇక శంకర్ మాట్లాడుతూ.."చాలామంది భార్యాభర్తల అందాన్ని చూసి పెళ్లిచేసుకుంటారు. అందుకే విడిపోతున్నారు. కానీ నేను లలితలో ప్రేమను చూశా. ఆమె మనసును చూశా. ఆమె మనసు స్వచ్ఛమైనది. అందుకే మేము వివాహం చేసుకున్నాం. అందం కంటే హార్ట్ ముఖ్యం." అని శంకర్ వివరించాడు.
లలితా బాన్సీ, శంకర్ ల నిజమైన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీ లవ్ స్టోరీ ఎందరికో స్ఫూర్తినిస్తుందని.. ప్రేమతో దేన్నయినా జయించవచ్చని.. మీరు ట్రూ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications