జీతం ఇవ్వడం లేదని Tcs ఆఫీస్ ముందు నిరసన.. యాజమాన్యం రియాక్షన్ ఇదే..!
పూణేలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయం ఎదుట జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూలై 2024 నుంచి జీతం క్రెడిట్ కాలేదని ఆరోపిస్తూ ఒక ఉద్యోగి కార్యాలయం ముందు పడుకొని నిరసన తెలియజేశాడు. జీతం ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని హైలెట్ చేస్తూ ఒక నోట్ కూడా రాసి ప్రదర్శించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న ఈ నిరసన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
A TCS employee is apparently protesting by sleeping outside the Pune office because his salary has not been credited.
— Jaydeep (@_jaydeepkarale) August 3, 2025
😢 pic.twitter.com/MV4rPRa4P7
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 70 గంటలకు పైగా పని చేయించుకునే టీసీఎస్ వంటి పెద్ద కంపెనీ, తమ ఉద్యోగులను ఇలాంటి దారుణమైన పరిస్థితిలోకి నెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "టీసీఎస్ బీ లైక్ నో శాలరీ, నో షెల్టర్.. శాడ్ అండ్ టెర్రిబుల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే టీసీఎస్ కంపెనీ ఖర్చుల తగ్గింపు వ్యూహంలో భాగంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఈ సంఘటన ఉద్యోగుల దుస్థితిని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులకు ఇలా జీతాలు చెల్లించకపోవడం వారి జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీసీఎస్ స్పందించాలని, ఉద్యోగికి న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
TCS ప్రకటన: ఉద్యోగి కేసుపై స్పందన
తాజాగా ఈ ఘటనపై TCS ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగి జాబ్‌కు రాకపోవడం వల్లే అతని జీతాన్ని నిలిపివేయబడిందని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతం సదరు ఉద్యోగి తిరిగి విధుల్లో చేరడానికి అభ్యర్థన చేసుకోవడంతో మేము ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నాము ,అతనికి తాత్కాలికంగా అవకాశం కల్పించాము. ఈ సమస్యను న్యాయబద్ధంగా, నిర్మాణాత్మకమైన పద్ధతిలో పరిష్కరించడానికి, మేము అతనికి పూర్తి మద్దతు ఇస్తున్నామని కంపెనీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications