Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రా పాలు కంపెనీలో సీనియర్ అధికారి, సుపారి ఇచ్చి నడిరోడ్డులో ఏం చేశారంటే ? రివర్స్ !

పని చేస్తున్న ప్రైవేట్ కంపెనీలో పై అధికారి టార్చర్ ఎక్కువ కావడంతో కొందరు ఉద్యోగులు సతమతం అయ్యారు. పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఆ ఉద్యోగులు సహనం కోల్పోయారు. తమ మీద పని ఒత్తిడి తీసుకు వస్తున్న అధికారికి బుద్ది చెప్పాలని కొందరికి సుపారి ఇచ్చి రంగంలోకి దింపారు. నడిరోడ్డు మీద పై అధికారిని అడ్డగించి ఇనుప రాడ్లతో చితకబాదేశారు. అయితే తరువాత అసలు కథ మొత్తం రివర్స్ అయ్యింది.

గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని రోడ్డులో మధ్యాహ్నం ఓ వ్యక్తి పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడే అతని మీద దాడి చేసింది ఎవరు? అని నెటిజన్లు ఆరా తీశారు. ఇదే సమయంలో వైరల్ వీడియో బెంగళూరు పోలీసుల కంట్లో పడటంతో పోలీసులు విచారణ చేశారు.

Employees of the company who gave supari to attack the superior officer in Bengaluru

బెంగళూరు పోలీసుల విచారణలో ఆవ్యక్తి మీద దాడికి గల కారణాలు వెల్లడికావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కంపెనీలో పని భారం ఎక్కువైందని, పై అధికారి టార్చర్ ఇచ్చారని అర్థం.

అయ్యింది. బైక్‌పై తన స్నేహితుడితో ప్రయాణిస్తున్న వ్యక్తిని అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్‌తో దారుణంగా దాడి చేశారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న కారు డ్యాష్‌బోర్డ్‌లో దాడి చేసిన వారి భాగోతం మొత్తం రికార్డు అయ్యింది.

ఇప్పుడు ఆ వీడియో ఆధారంగా బెంగళూరు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
దాడికి గురైన వ్యక్తి పేరు సురేష్, గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ప్రముఖ పాలు సరఫరా చేసే కంపెనీలో సురేష్ ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాల కంపెనీకి బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి. ఇదే కార్యాలయంలో సురేష్ ఆడిటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సురేష్ వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెరిగిందని సమాచారం.

దానికితోడు రోజూవారీ సొమ్ము ఏ రోజుకు ఆ రోజు క్లియరెన్స్‌ చేయాలని కూడా సురేష్ ఆ కంపెనీ ఉద్యోగులను ఆదేశించాడని వెలుగు చూసింది. ఈ విషయం అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఉమాశంకర్‌, వినీష్‌కు కోపం తెప్పించింది.

ఇదే కారణంతో గతంలో అదే కంపెనీలో పనిచేసి ప్రస్తుతం ఆ కంపెనీలో ఉద్యోగం మానేసిన ఓ వ్యక్తి ద్వారా సందీప్‌ అనే వ్యక్తిని సంప్రదించిన ఉమాశంకర్, వినీష్ ఆడిటర్ సురేష్ మీద దాడి చేయాలని మాట్లాడుకున్నారు.

తరువాత సురేష్ మీద దాడి చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పి సుపారి కింద సందీప్ కు డబ్బులు ఇచ్చారని పోలీసులు తెలిపారు. అనుకున్న ప్రకారం సురేష్ మీద దాడి జరిగింది. అయితే దాడి జరిగిన తర్వాత బాధితుడు సురేష్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదు. అయితే ఆదాడి జరిగిన సమయంలో రికార్డు అయిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

ఇదే సమయంలో సురేష్ మీద దాడికి గల కారణాలను బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. బెంగళూరులోని హెణ్ణూరులోని పోలీసులు కేసు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఆఫీస్ లో పని ఒత్తిడి కారణంగా అక్కడ పనిచేసే సిబ్బంది ఉన్నతాధికారులపై సుపారీ ఇచ్చి దాడి చేయించడం బెంగళూరులో కలకలం రేపింది. ఈ కేసు వివరాలు వినడానికి విడ్డూరంగా ఉందని బెంగళూరు పోలీసులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+