చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్
నక్సలైట్లతో జరిగిన ఈ పోరులో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ సహా ముగ్గురు జిల్లా రిజర్వు గార్డ్స్ సిబ్బంది మరణించారు
చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. నక్సలైట్లతో జరిగిన ఈ పోరులో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ సహా ముగ్గురు జిల్లా రిజర్వు గార్డ్స్ సిబ్బంది మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. రిజర్వ్ గార్డ్ బృందం సెర్చ్ ఆపరేషన్ లో ఉన్నప్పుడు జాగర్ గుండ, కుండేడ్ గ్రామాల మధ్య ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీటీఐకి తెలిపారు.
రాజధాని రాయ్ పూర్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాగర్ గుండ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి ఈ బృందం ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పారు. ఎదురు కాల్పుల్లో ఏఎస్ఐ రామురామ్ నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా, సైనిక్ వంజం భీమా మృతిచెందారు. ఘటనా స్థలం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.













Click it and Unblock the Notifications