ఎన్‌కౌంటర్ చేస్తారు, పోలీసుల వేధింపులు: ప్రవీణ్ తొగాడియా సంచలనం
Recommended Video

న్యూఢిల్లీ: రాజస్థాన్ పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. ఈ విషయమై తనకు సమాచారం ఉన్నందునే పోలీసుల నుండి తప్పించుకొన్నానని ఆయన చెప్పారు.
మంగళవారం నాడు ప్రవీణ్‌తొగాడియా మీడియాతో మాట్లాడారు. ఓ కేసులో రాజస్థాన్ పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. అయితే ఆ కేసులో పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదం ఉందని సమాచారం ఉండడంతో తాను పోలీసుల నుండి తప్పించుకొన్నట్టు ఆయన చెప్పారు.

తనపై తప్పుడు కేసులు పెట్టారని ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. పదేళ్ల నాటి కేసులో తనను వేధింపులకు గురిచేస్తున్నారని తొగాడియా ఆరోపణలు చేశారు. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు తనను వెంటాడుతున్నారని తొగాడియా చెప్పారు.
తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని తొగాడియా ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే తాను మొబైల్ స్విచ్చాఫ్ చేసినట్టు ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. తాను కోలుకొన్నాక పోలీసులకు లొంగిపోనున్నట్టు తొగాడియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications