ఇంజనీర్ కొడుకు బీభత్సం.. రంపంతో నరికి నదిలో పడేసిన కిరాతకుడు!

పున్నామ నరకం నుంటి కాపాడతాడనుకున్న కుమారుడే కన్న తల్లిదండ్రులను కిరాతకంగా నరికి హత్య చేశాడు. సభ్యసమాజం తలదించుకునే అత్యంత కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులను ఓ కొడుకు దారుణంగా హత్య చేసి వారి మృతదేహాలను రంపంతో ముక్కలు ముక్కలుగా కోసం నదిలో పడేసిన ఉదంతం కలకలం రేపుతోంది. మతాంతర వివాహం, డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘోరానికి దారి తీసింది.

అసలేం జరిగిందంటే?
జౌన్‌పూర్‌కు చెందిన శ్యామ్ బహదూర్ (62), బబిత (60) దంపతులకు అంబేష్ అనే కుమారుడు ఉన్నాడు. ఇంజనీర్ అయిన అంబేష్ ఐదేళ్ల క్రితం ఒక ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే మతాంతర వివాహం కావడంతో తల్లిదండ్రులు ఆ కోడలిని అంగీకరించలేదు. అంబేష్‌కు ఇద్దరు పిల్లలు పుట్టినా, తండ్రి శ్యామ్ బహదూర్ మాత్రం ఆమెను ఇంటికి రానివ్వలేదు. భార్యను వదిలేయాలని కొడుకుపై ఒత్తిడి తెచ్చాడు.

Engineer Son Brutally Kills Parents in Jaunpur Bodies Chopped and Dumped in River

డబ్బుల కోసం గొడవ.. ఆపై దారుణం
తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక అంబేష్ తన భార్యతో విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. విడాకుల పరిహారం కింద ఆమెకు రూ. 5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. డిసెంబర్ 8న ఆ డబ్బుల గురించి తండ్రిని అడగగా.. ఆయన నిరాకరించాడు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో ఆగ్రహానికి లోనైన అంబేష్.. రోలు పచ్చడి దంచే రాయితో తల్లి బబిత తలపై బలంగా కొట్టాడు. ఆమె అరుపులు విని తండ్రి కేకలు వేయడంతో, ఆయన తలపై కూడా తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆ వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

సాక్ష్యాలు మాయం.. మృతదేహాలు ముక్కలుగా..
హత్య చేసిన తర్వాత దొరికిపోకూడదని అంబేష్ పక్కా ప్లాన్ వేశాడు. మృతదేహాలను తరలించేందుకు పెద్ద సంచులు దొరకకపోవడంతో, గ్యారేజీలో ఉన్న రంపంతో తల్లిదండ్రుల దేహాలను ఆరు ముక్కలుగా నరికాడు.ఆ ముక్కలను గోనె సంచుల్లో మూటకట్టి, తెల్లవారుజామున తన కారులో తీసుకువెళ్లి సమీపంలోని నదిలో పడేశాడు. సాక్ష్యాలను మాయం చేసిన అనంతరం తన సోదరి వందనకు ఫోన్ చేసి.. "తల్లిదండ్రులు గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు, వారిని వెతకడానికి నేను వెళ్తున్నాను" అని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

గుట్టు రట్టయ్యిందిలా..
తల్లిదండ్రులు, సోదరుడు కనిపించకపోవడంతో వందన పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 రోజుల తర్వాత అంబేష్ జౌన్‌పూర్ తిరిగిరాగా.. బంధువుల సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మొదట తడబడిన అంబేష్, పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు.

దొరికిన శరీర భాగాలు
పోలీసులు అంబేష్ చూపిన ఆధారాలతో నదిలో గాలింపు చేపట్టారు. శ్యామ్ బహదూర్ శరీరంలోని ఒక భాగం లభ్యమైంది. హత్యకు వాడిన రాయి, మృతదేహాలను కోయడానికి వాడిన రంపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మిగిలిన శరీర భాగాల కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. అంబేష్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+