బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలేజ్ లేడీఎస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరా, వీడియోలతో బ్లాక్ మెయిల్, కోరిక తీర్చండి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంజనీరింగ్ కాలేజ్ లేడీఎస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న విద్యార్థిని బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి కోరిక తీర్చమని వారిని వేదించాడని పోలీసులు అంటున్నారు.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంజనీరింగ్ కాలేజ్

తమిళనాడుకు చెందిన సిద్దార్థ్ (21) అనే యువకుడిని అరెస్టు చేశామని సోమవారం పోలీసులు అన్నారు. బెంగళూరు నగర శివార్లలోని చూడసంద్ర ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లో సిద్దార్థ్ విద్యాభ్యాసం చేస్తున్నాడు.

హాస్టల్ లో సీక్రెట్ కెమెరా

హాస్టల్ లో సీక్రెట్ కెమెరా

అదే ఇంజనీరింగ్ కాలేజ్ లో లేడీఎస్ హాస్టల్ ఉంది. లేడీఎస్ హాస్టల్ లోని బాత్ రూంలో సిద్దార్థ్ రహస్యంగా కెమెరా ఫిట్ చేశాడు. తరువాత అమ్మాయిల నగ్న వీడియోలు తీసి తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని వారిని బ్లాక్ మెయిల్ చేశాడు.

ధైర్యం చేసిన అమ్మాయిలు

ధైర్యం చేసిన అమ్మాయిలు

డబ్బులు తీసుకోవడమే కాకుండా తనకు లైంగిక కోరిక తీర్చకుంటే మీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని సిద్దార్థ్ వారిని బెదిరించాడు. సిద్దార్థ్ వేదింపులు ఎక్కువ కావడంతో ఇటీవల అమ్మాయిలు ధైర్యం చేసి పరప్పన అగ్రహార పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎవరి హస్తం ఉంది ?

ఎవరి హస్తం ఉంది ?

కేసు నమోదు చేసిన పోలీసులు సిద్దార్థ్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ లో ముగ్గురు అమ్మాయిల వీడియోలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. సిద్దార్థ్ వెనుక ఇంకా కొందరి హస్తం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కెమెరా ఎలా పెట్టాడు ?

కెమెరా ఎలా పెట్టాడు ?

లేడీఎస్ హాస్టల్ బాత్ రూంలోకి సిద్దార్థ్ ఎలా వెళ్లాడు ?, అంత రహస్యంగా కెమెరా ఎలా ఫిట్ చేశాడు ? కాలేజ్ అమ్మాయిలు ఎవరైనా సహకరించారా ?, లేదా హౌస్ కీపింగ్ పని చేసే వారి సహాయంతో సిద్దార్థ్ కెమెరా ఫిట్ చేయించాడా ? అంటూ అనేక కోణాలలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
A engineering student fixed camera to ladies bath room near Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X