3 రోజులు రేప్ చేసి, అసభ్యంగా వీడియో తీశాడు: టెక్కీ
ఇండోర్: ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన ఇరవై మూడేళ్ల మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ పైన అత్యాచారం చేసి, ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఇరవై అయిదేళ్ల రిషబ్ ఇండోర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
అతడు తన పైన అత్యాచారం చేశాడని, అంతేకాకుండా కొన్ని నెలలుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఇండోర్ వచ్చి తనను సైట్ సీయింగ్‌కు తీసుకు వెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఆ సమయంలో తనకు మత్తుమందు కలిపిన కాఫీ ఇచ్చాడని, మొబైల్ ఫోన్లో తనను అసభ్యంగా వీడియో తీశాడని తెలిపింది. రెండు నెలల తర్వాత తనకు ఫోన్ చేసి, వడోదరకు రాకపోతే ఇంటర్నెట్లో వీడియో పెడతానని బెదిరించాడని, తన పైన మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడని ఆరోపించింది.
కొద్దిరోజుల తర్వాత మళ్లీ కొన్ని అసభ్యకరమైన చిత్రాలు తనకు పంపించి, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. తాను నిరాకరించడంతో తనను చంపేస్తానని, ఆ ఫోటోలు పేరెంట్స్‌కు పంపిస్తానని బెదిరించాడని, అతని వేధింపులు భరించలేక తాను ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. పోలీసుల సూచన మేరకు అతనిని ఇండోర్‌కు రప్పించింది. దీంతో అతడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications