వైట్ టైగర్స్ ఎంక్లోజర్‌లోకి దూకి కాలు దువ్విన టెక్కీ

స్థానిక పోలీసులు, జూ కీపర్స్ ఆ ఇంజనీరింగ్ విద్యార్థిని బయటకు తీసుకుని వచ్చారు. గ్వాలియర్‌లోని ఆనంద నగర్‌కు చెందిన యశోనందన్ కౌశిక్ అనే విద్యార్థి ప్రహరీగోడపైకి ఎక్కి ఎంక్లోజర్‌లోకి దూకి, టైగర్స్‌ను పోరాటానికి పిలిచాడు.
అతను లోనికి దూకి కయ్యానికి కాలు దువ్వడంతో బెదిరిన ఆ రెండు వైట్ టైగర్స్ పరుగులు తీశాయి. వింత వింతగా నృత్యం చేస్తూ వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కౌశిక్ వాటికి సవాల్ చేస్తుండడంతో జూ కీపర్స్ లోనికి వెళ్లి టైగర్స్‌ను లోనికి పంపి తాళం వేశారు.
కౌశిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కౌశిక్ ఇండోర్‌లోని ఐపియస్ పోలీసు అకాడమీ కాలేజీలో చదువుతున్నట్లు అతని తండ్రి తెలిపారుడ. అతను ఎలక్ట్రానిక్ విద్యార్థి.












Click it and Unblock the Notifications