పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఇంగ్లాండ్ యువతి: కన్నడిగకు రూ. 11 లక్షలు పంగనామాలు !

కన్నడ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఇంగ్లాండ్ యువతి కన్నడిగ యువకుడికి కుచ్చుటోపీ పెట్టింది.

బెంగళూరు: కన్నడ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఇంగ్లాండ్ యువతి కన్నడిగ యువకుడికి కుచ్చుటోపీ పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 11,39,535 వారి అకౌంట్ లో జమ చేచించుకుని మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.

మంగళూరు సమీపంలోని మల్కి ప్రాంతానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకోవాలని అతని పూర్తి వివరాలు, ఫోన్ నెంబర్ కన్నడ మ్యాట్రిమోనియల్ పెట్టాడు. ఇంగ్లాండ్ కు చెందిన స్టెల్లా మేరీస్ అనే యువతి యువకుడి వివరాలు తెలుసుకుని తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసింది.

ఇంగ్లాండ్ లో టెక్కీ ఉద్యోగం

ఇంగ్లాండ్ లో టెక్కీ ఉద్యోగం

పెళ్లి చేసున్న తరువాత ఇంగ్లాండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన స్టెల్లా మేరీస్ ఆమె మొబైల్ నెంబర్ + 447743371221 నెంబర్ వాట్సాప్ లో మల్కి యువకుడికి పంపించింది. తరువాత మైకెల్ ఆంటోని అనే వ్యక్తిని కన్నడిగ యువకుడికి పరిచయం చేసి అతని మొబైల్ నెంబర్ ఇచ్చింది.

ఇంగ్లాండ్ వీసా ఇప్పిస్తాం

ఇంగ్లాండ్ వీసా ఇప్పిస్తాం

మైకెల్ ఆంటోని మల్కి యువకుడికి ఫోన్ చేసి ఇంగ్లాండ్ రావడానికి వీసా తీసిస్తానని నమ్మించి మూడు అఫ్లికేషన్ ఫాంలు ఆన్ లైన్ లో పంపించాడు. వీసా కోసం రూ. 26,560 కెనరా బ్యాంక్ కన్నిగోళి (కర్ణాటక) శాఖ నుంచి ఇంగ్లాండ్ కు బదిలి చేయించుకున్నారు. అనంతరం మైకెల్ ఆంటోని జేమ్స్ భేవన్ అనే వ్యక్తి ఈ మెయిల్ లో మల్కి యువకుడితో సంప్రదించారు.

మొత్తం రూ. 11. 29 లక్షలు

మొత్తం రూ. 11. 29 లక్షలు

యాంటీ టెర్రిరిస్టు క్లియరెన్స్ పత్రాలు మంజూరు చెయ్యడానికి రూ. 83,000 చెల్లించాలని చెప్పాడంతో మల్కి యువకుడు ఆ నగదు ఆన్ లైన్ లో బదిలి చేశాడు. ఈ విధంగా స్టెల్లా మేరీస్, మైకెల్ ఆంటోని, జేమ్స్ భేవన్ వివిధ పత్రాలు మంజూరు కావాలంటూ రూ. 11,29,535 వారి అకౌంట్ కు బదిలి చేయించుకున్నారు.

 పెళ్లి లేదు, డబ్బు కోసం టార్చర్

పెళ్లి లేదు, డబ్బు కోసం టార్చర్

ఇంగ్లాండ్ నుంచి ఎలాంటి దృవీకరణ పత్రాలు రాకపోవడం, పదేపదే డబ్బులు బదిలి చెయ్యాలని ఫోన్లు చెయ్యడంతో మల్కి యువకుడికి అనుమానం వచ్చింది. పెళ్లి కాకముందే ఇంత డబ్బు గుంజేసిన వారి మీద మల్కి యువకుడికి అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 నాకు పెళ్లే వద్దు దేవుడా

నాకు పెళ్లే వద్దు దేవుడా

కర్ణాటక సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి ఇంగ్లాండ్ పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు. స్టెల్లా మేరీస్, మైకెల్ ఆంటోని, జేమ్స్ భేవన్ ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ ల ఆధారం కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. మోసపోయిన మల్కి యువకుడు నాకు పెళ్లే వద్దూ దేవుడా అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+