'భయమొద్దు, సరిపోయే కరెన్సీ ఉంది', రూ.100 నోట్లే లంచం ఇవ్వాలని..!
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు మార్పించుకునేందుకు జనాలు బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఏటీఎంల వద్ద క్యూ కట్టినా అవి పని చేయడం లేదు. తమ వరకు చెల్లుబాటు అయ్యే కరెన్సీ వస్తుందో లేదోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) దీని పైన స్పందించింది. కొత్త నోట్లు సరిపడా ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ప్రజలు సహనంతో ఉండాలని, అందరికీ సరిపడా కొత్త నోట్లు ఉన్నాయని, దేశవ్యాప్తంగా వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది.

లంచం వంద నోట్లలోనే ఇవ్వాలన్న అధికారి అరెస్ట్
రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటిని చాలామంది తీసుకోవడం లేదు. మహారాష్ట్రలో ఓ అధికారి తనకు లంచం ఇవ్వాలని, అది కూడా రూ.100 నోట్లే ఇవ్వాలని షరతు పెట్టాడు. అతనిని అధికారులు అరెస్ట్ చేశారు.
సోలాపూర్ జిల్లాలోని మోహోల్ పంచాయత్ సమితికి చెందిన వ్యవసాయ శాఖాధికారి బాలాసాహెబ్ భికాజీ బాబర్ గురువారం ఓ వ్యక్తి నుంచి రూ.2500 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
కృషి సేవా కేంద్రం ప్రతిపాదనకు అంగీకారం తెలిపేందుకు బాలాసాహెబ్ లంచం అడిగాడని, అది కూడా రూ.100నోట్లే ఇవ్వాలని షరతు పెట్టాడని ఓ వ్యక్తి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం పన్ని బాలాసాహెబ్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications