22.55 ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ 8.50 జమ.. ఇంట్రెస్ట్ ఇంత పెరిగింది...
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ తీపి కబురు చెప్పింది. దీంతో 22.55 కోట్ల మంది ఖాతాదారులకు మేలు జరగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోన్న సంగతి తెలిసిందే.
గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈపీఎఫ్ఓ 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రా ఉన్నందున 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ మార్చలేదు.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి.. 8.5 శాతం తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చిన ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది.
ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్‌స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications