ఈపీఎఫ్‌ఓ సూపర్ ఆఫర్.. బెస్ట్ "ట్యాగ్ లైన్" ఇస్తే అదిరిపోయే క్యాష్ ప్రైజ్ !!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వినూత్న పోటీని తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ ప్రజలు.. తమ సంస్థ లక్ష్యాలు, సేవా ధోరణి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించేలా ఒక సరికొత్త ట్యాగ్‌లైన్‌ను రూపొందించమని కోరింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన బహుమతి కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఎవరైనా పాల్గొనగల ఈ పోటీపై ప్రస్తుతం విశేష ఆసక్తి నెలకొంది.

ఈపీఎఫ్‌ఓ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పోటీ ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలోని సృజనాత్మకతను వెలికితీయడమని స్పష్టం చేసింది. ఈ పోటీ అక్టోబర్ 1, 2025న ప్రారంభమై నవంబర్ 10, 2025 వరకు కొనసాగుతుందని వివరించారు. ఆసక్తిగల వారు ఈపీఎఫ్‌ఓ అధికారిక ట్విట్టర్ ఖాతా లేదా వెబ్‌సైట్‌లో విడుదల చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసి తమ ట్యాగ్‌లైన్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని పేర్కొంది. QR కోడ్‌ను స్కాన్ చేయగానే పోటీకి సంబంధించిన ఫారమ్ ఓపెన్ అవుతుందని.. అక్కడ ట్యాగ్‌లైన్‌ను నమోదు చేసి సమర్పించవచ్చని వెల్లడించింది.

epfo-tag-line-competition-and-cash-prize-details

ట్యాగ్‌లైన్ మార్గదర్శకాలు..

  • ఈపీఎఫ్‌ఓ తెలిపిన ప్రకారం, ట్యాగ్‌లైన్ తప్పనిసరిగా
  • సంక్షిప్తంగా, అర్థవంతంగా ఉండాలి
  • సంస్థ సేవలు, భద్రత, నమ్మకం, పారదర్శకత వంటి అంశాలను ప్రతిబింబించాలి.
  • హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో సమర్పించవచ్చు.
  • ఒక వ్యక్తి నుండి ఒక్క ట్యాగ్‌లైన్ మాత్రమే స్వీకరించబడుతుంది.
  • అనేక ఎంట్రీలు పంపిన వారు అర్హత కోల్పోతారు.

విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు..

సంస్థ అత్యుత్తమ ట్యాగ్‌లైన్‌లను ఎంపిక చేసి ముగ్గురిని విజేతలుగా ప్రకటించనుంది.

  • మొదటి విజేతకు రూ.21,000
  • రెండవ విజేతకు రూ.11,000
  • మూడవ విజేతకు రూ.5,100 నగదు బహుమతిని అందజేయనున్నారు.

విజేతలకు ఢిల్లీ‌లో జరగనున్న ఈపీఎఫ్‌ఓ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందుతుంది. అక్కడే అధికారికంగా వారికి సత్కారం జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలను నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌ఓ, ప్రజలకు భద్రతా నిధి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+