తమిళనాడులో శశికళ 'రిమోట్' పాలన, పళని వెనుక నటరాజన్ కూడా!
తమిళనాడులో రెండు వారాల హైడ్రామాకు బుధవారం నాడు తెరపడింది. అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎంపిక చేసిన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠం వరిస్తుంది. ఆయన ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చెన్నై: తమిళనాడులో రెండు వారాల హైడ్రామాకు బుధవారం నాడు తెరపడింది. అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎంపిక చేసిన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠం వరిస్తుంది. ఆయన ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పళని స్వామి వర్సెస్ పన్నీరు
ముఖ్యమంత్రి పీఠం కోసం తొలుత శశికళ - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంల మధ్య, ఆ తర్వాత రెండు రోజులుగా పన్నీరు సెల్వం - పళని స్వామిల మధ్య పోటా పోటీ నెలకొంది. అయితే, పన్నీరు సెల్వంకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం కనిపించలేదు. దీంతో పన్నీరు వెనక్కి తగ్గారని అంటున్నారు.

కారాగారం నుంచి చిన్నమ్మ చక్రం
ఇప్పుడు మరో ప్రశ్న అందరిని తొలచివేస్తోంది. అదేమంటే పరప్పన అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మ కారాగారం నుంచే చక్రం తిప్పుతారని అంటున్నారు. అంతేకాదు, శశికళ భర్త నటరాజన్ కూడా పళని వెనుక ఉండి నడిపిస్తారని అంటున్నారు.

నమ్మకస్తుడు
జయలలితకు పన్నీరు సెల్వం ఎలా నమ్మకస్తుడో.. శశికళకు పళనిస్వామి కూడా అంతే నమ్మకస్తులు. ఆమె జైలుకు వెళ్లే ముందు.. పన్నీరుకు చెక్ చెప్పేందుకు తనకు విశ్వాసపాత్రుడైన పళని స్వామిని అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎంపిక చేశారు.

పన్నీరు ఎమ్మెల్యేలను సంప్రదించినా..
దీంతో రెండు రోజులుగా పళని స్వామి వర్సెస్ పన్నీరు సెల్వంగా కనిపించింది. అయితే, పన్నీరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయనే పళనిస్వామి వైపు మొగ్గినట్లుగా కనిపిస్తోంది. పళనికి ఆయన మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

శశికళ చక్రం
పళని స్వామి ముఖ్యమంత్రి అయితే.. ఇక శశికళ జైలు నుంచి చక్రం తిప్పుతారని అంటున్నారు. పళని స్వామి రిమోట్ కంట్రోల్ అవుతారని భావిస్తున్నారు. ఈ నాలుగేళ్లు పళని స్వామి సీఎం అయినా... వెనుక నుంచి నడిపించేది మాత్రం శశికళనే అని చెప్పవచ్చు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications