మహిళా ఉద్యోగినితో ఆఫీసులోనే రాసలీలలు: తమిళనాడు కోఆపరేటివ్ సొసైటీలో..

Subscribe to Oneindia Telugu

టీనగర్: ఓ మహిళా ఉద్యోగినితో సహకార సంఘం అధికారి నెరిపిన రాసలీలలు బయటపడ్డాయి. దీంతో వీరిద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఒకే కార్యాలయంలో పనిచేస్తూ.. కార్యాలయ ప్రాంగణంలోనే వీరు రాసలీలలు కొనసాగిస్తుండటంతో.. వీరిపై పలు ఫిర్యాదులు అందాయి.

తమిళనాడు పెరుందురై యూనియన్ పరిధిలోని నల్లాంపట్టి పట్టణ పంచాయితీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. నల్లాంపట్టి పట్టణ పంచాయితీ ప్రాథమిక సహకారం రుణం సంఘంలో.. సంఘం కార్యదర్శిగా గోపాలస్వామి పనిచేస్తున్నారు. ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళతో ఆయన గత కొంతకాలంగా రాసలీలలు నెరుపుతున్నారు.

erode cooperative society secretary suspension

విషయం సంఘం అధ్యక్షుడి దృష్టికి రావడంతో.. ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా.. జిల్లా సహకార సంఘం డిప్యూటీ రిజిస్ట్రార్ మణికి ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఇరువురి సంజాయిషీ సరిగా లేని కారణంగా.. ఇద్దరిని సస్పెండ్ చేశారు. దీనికి తోడు వీరివురు అసభ్యంగా వ్యవహరించిన వీడియో ఆధారాలు బహిర్గతం అయ్యాయి. దీంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two employees were suspended in Tamilnadu co-operative society on the allegations of sexual acts in office
Please Wait while comments are loading...