ఆ విషయంలో అమెరికా కంటే భారత్ బెస్ట్.. ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ తాజాగా భారత్ లో పర్యటించారు. ఆధ్యాత్మిక ప్రదేశం అయిన అయోధ్యను ఆయన సందర్శించారు. ఈ క్రమంలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కల్చర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉందని ప్రశంసించారు.
స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశం అయిన అయోధ్యను సందర్శించారు. శ్రీరాముడిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని వాణిజ్య పరమైన చర్చల కోసం భారత్ కు వచ్చినట్లు తెలిపారు. భారత్ ఓ వండర్ ఫుల్ ప్లేస్ అని ప్రశంసించారు.

" భారత్ ఓ అద్భుతమైన ప్రదేశం. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. ఈ దేశ ప్రజలు ప్రేమ, కరుణతో ఉంటారు. అమెరికాలోనూ చాలా మంది భారతీయులు ఉన్నారు. అందుకే నాకు భారతీయులు సంస్కృతి తెలుసు. అందుకే నాకు భారతీయులు అంటే ఇష్టం. ది బెస్ట్ పీపుల్ ఇక్కడే ఉంటారు. ఏ దేశంలోనూ ఉండరు" అని మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
#WATCH | UP: Father of Tesla CEO Elon Musk and Servotec's Errol Musk arrived at the Ram Temple in Ayodhya. pic.twitter.com/W2XiaYEq4i
— ANI (@ANI) June 4, 2025
అమెరికా- భారత్ రిలేషన్ పై మీడియా ప్రశ్నలు అడగ్గా.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఇక ఎర్రోల్ మస్క్ జూన్ 1 న భారత్ లో పర్యటనకు వచ్చారు. ఐదు రోజులపాటు భారత్ లోనే పర్యటించనున్నారు. అనంతరం జూన్ 6న దక్షిణాఫ్రికా బయల్దేరనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా హరియాణాలోని సోలార్ అండ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఆయన సందర్శించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.
#WATCH | Ayodhya, UP | Errol Musk says, "India is a wonderful place. As many people as possible should come to India. There are a lot of Indians in the country where I come from. So, I know the Indian culture. The people are full of love, kindness, probably the best people you… pic.twitter.com/t4ok5E8hri
— ANI (@ANI) June 4, 2025
మరోవైపు ఎలాన్ మస్క్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన యంత్రాంగం నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రతిపాదించిన ది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు కారణంగా అమెరికాలో ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ క్రమంలో ట్రంప్ వైఖరిని ప్రశ్నిస్తూ ఆయన ట్రంప్ పరిపాలన యంత్రాంగం నుంచి వైదొలిగారు.












Click it and Unblock the Notifications