ఆ ఆలయానికి వెళ్లే భక్తులు తప్పిపోకుండా ట్రాక్ చేస్తారు

జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతం వెలిసిన వైష్ణోదేవి ఆలయం ఈ నెల 14వ తేదీ నుంచి పునరుద్ధరణకు నోచుకోనుంది. కొండచరియలు విరిగిపడటం, వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని రోజుల పాటు ఈ ఆలయాన్ని మూసివేశారు. 14 నుండి యాత్రను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు శ్రీ మాతా వైష్ణో దేవి ట్రస్ట్ బోర్డు అంగీకరించింది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే యాత్ర కొనసాగుతుంది.

ఎంతో ప్రత్యేకత ఉన్న ఆలయం ఇది. రుగ్వేద కాలం నాటి ఆలయంగా దీన్ని భావిస్తారు. సముద్ర మట్టం నుంచి 5,300 అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత పంక్తుల మధ్య కొలువుతీరారు అమ్మవారు. మంచుకొండ‌ల మధ్య ఉంటుంది. ఏటా సగటున ఎనిమిది మిలియన్ల మంది ఈ ఆల‌యాన్ని సందర్శిస్తారు. వైష్ణోదేవి అమ్మవారు స్వయంభువుగా చెబుతారు. సరస్వతి, లక్ష్మితో కలిసి ఆవిర్భవించారు. భైర‌వుడు అనే ఓ రాక్ష‌సున్ని సంహరించిన అనంత‌రం దుర్గాదేవే వైష్ణో దేవి రూపంలో ఇక్క‌డ అవ‌త‌రించింద‌ని చెబుతారు.

Essential Guidelines for a Smooth Vaishno Devi Yatra resuming from September 14

ఆగస్టు 26న కాట్రా నుండి వైష్ణోదేవి ఆలయం వరకు వరకు ఉన్న 12 కిలోమీటర్ల మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో యాత్రను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో 34 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో భక్తులకు ప్రయాణం సురక్షితం కాదని అధికారులు తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

భక్తుల భద్రత, సౌకర్యం కోసం ట్రస్ట్ బోర్డు కొన్ని సూచనలను విడుదల చేసింది. భక్తులు తమ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. కేటాయించిన మార్గాల్లో మాత్రమే ప్రయాణించాలి. నిషేధిత ప్రాంతాలకు దూరంగా ఉండాలి. RFID (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్రాకింగ్ తప్పనిసరి. దీనివల్ల భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా లైవ్ అప్‌డేట్‌లు, ఆన్‌లైన్ బుకింగ్ సేవలు, హెల్ప్‌లైన్ మద్దతు అందుబాటులో ఉంటాయి.

కాట్రాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం జమ్ము. జమ్ము నుంచి 42 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కాట్రాకు రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. జమ్మూకు వెళ్లడానికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి రైలు కనెక్టివిటీ ఉంది. లేదా ఢిల్లీకి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా వెళ్లొచ్చు. త్రికూట పర్వతం మీదికి వెళ్లడానికి కాలి న‌డ‌కలో చేరుకోవాలి. గుర్ర‌ాల మీద వెళ్లే వీలు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+