స్పీకర్ చాంబర్ లో టీటీవీ దినకరన్ అనుచరుల హంగామా, పోలీసులను వెనక్కి!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన టీటీవీ దినకరన్, ఆయన అనుచరులు శుక్రవారం చెన్నైలోని తమిళనాడు సచివాలయంలో నానా హంగామా చేశారు. పోలీసులను వెనక్కినెట్టి స్పీకర్ చాంబర్ లోకి దూసుకెళ్లారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చెయ్యడానికి చెన్నైలోని సచివాలయం చేరుకున్నారు. టీటీవీ దినకరన్ వెంట ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో సచివాలయం చేరుకున్నారు.

శాంతి భద్రతల కారణంగా టీటీవీ దినకరన్ వెంట కొందరు మాత్రమే సచివాలయంలోకి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే టీటీవీ దినకరన్ అనుచరులు నానా హంగామా చేస్తూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు.

టీటీవీ దినకరన్ వర్గీయులను అక్కడున్న పోలీసులు అడ్డుకోలేకపోయారు. పోలీసులను వెనక్కి నెట్టివేసి టీటీవీ దినకరన్ తో పాటు స్పీకర్ ధనపాల్ చాంబర్ లోకి ఆయన అనుచరులు దూసుకెళ్లారు. టీటీవీ దినకరన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆయన అనుచరులు హంగామా చేశారు. స్పీకర్, టీటీవీ దినకరన్ ను చుట్టుముట్టి పెద్దఎత్తున నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications