మోడలింగ్ లో అవకాశమిస్తానంటూ వీడియో తీసి, ఇలా....

ఫేస్ బుక్ లో పరిచయమైన మైనర్ బాలికను మోడలింగ్ లో అవకాశం కల్పిస్తానని చెప్పి

బెంగుళూరు:ఫేస్ బుక్ లో పరిచయమైన విధ్యార్థినికి మోడలింగ్ రంగంలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి లోబర్చుకొని లైంగికదాడులకు పాల్పడ్డాడు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

ముంబైకి చెందిన మైనర్ బాలిక బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఫ్యాషన్ ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తోన్న ప్రగదీశ్ కపూర్ అనే వ్యక్తి ఆ బాలికను ఫేస్ బుక్ లో పరిచయం చేసుకొన్నాడు.

event manager held for raping model

మోడలింగ్ లో అవకాశం కల్పిస్తానని ఆ బాలికను నమ్మించాడు. ఆమెకు తెలియకుండానే పాలలో మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. ఈ వీడియోల ద్వారా ఆమెను బ్లాక్ మెయిల్ చేసేవాడు.

అంతేకాదు తాను కోరుకొన్నప్పుడల్లా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. నిందితుడి వేధింపులు తట్టుకోలేక బాలిక రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుదవారం నాడు కపూర్ ను అరెస్టు చేశారు. నిందితుడి నుండి ల్యాప్ టాప్ ,ఫోన్ ను స్వాధీనం చేసుకొన్నారు.

ఈ ల్యాప్ టాప్ ల్లో ఇతర మోడల్స్, ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పోస్కో కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+