డ్యాన్స్ బార్లు: పోలీస్ స్టేషన్ లో లైవ్ (ఫోటోలు)
ముంబై: ముంబై నగరంలో డ్యాన్స్ బార్ల పై గట్టి నిఘా వెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డ్యాన్స్ బార్లలో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో అక్కడి దృశ్యాలు ప్రసారం (లైవ్) అయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముంబై నగరంలోని అన్ని డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యడంతో పాటు అనేక నియమాలు పాటించాలని మహారాష్ట్రలోని ఫడ్నవిస్ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసిందని డ్యాన్స్ బార్ల నిర్వహకులు ఆరోపిస్తున్నారు.
ముంబై నగరంలో డ్యాన్స్ బార్లపై నిషేధం విధిస్తూ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీం కోర్టు వేలాధి మంది మహిళలు ఉపాధి కొల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ నియమాలు బారడు
సుప్రీం కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. నూతన విధివిధానాలు రూపొందించింది.

పాటించాలి
మహారాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ సత్బీర్ సింగ్ డ్యాన్స్ బార్ల నిర్వహకులు పాటించవలసిన నిబంధనలను వెల్లడించారు.

ప్రతి బార్ లో సీసీ కెమెరాలు
ప్రతి డ్యాన్స్ బార్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లలో ప్రత్యక్ష ప్రసారం కావడానికి అవకాశం కల్పించాలి.

ఆరు మందికే అనుమతి
డ్యాన్స్ ఫ్లోర్ పై ఒకే సారి ఆరు మంది మహిళలు డ్యాన్స్ చెయ్యడానికి అనుమతి ఇచ్చారు. అనుమతించిన సమయంలోనే డ్యాన్స్ లు చెయ్యాలి.

వారితో డ్యాన్స్ చెయ్యరాదు
మందు బాబులు డ్యాన్స్ ఫ్లోర్ లపైకి వెళ్లి అమ్మాయిలతో డ్యాన్స్ చెయ్యడానికి అవకాశం లేదు. అలా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

మందు బాబులకు దూరంగా
మందు బాబులకు దూరంగా డ్యాన్స్ ఫ్లోర్లు ఏర్పాటు చెయ్యాలి. యువతులను ఎలాంటి పరిస్థితుల్లోముట్టుకోవడానికి వీలులేదు.

నో కరెన్సీ
గతంలో డ్యాన్స్ బార్లలో డ్యాన్స్ గర్ల్స్ మీద విచ్చల విడిగా కరెన్సీ నోట్లు వెదజల్లేవారు. అయితే ఇప్పుడు కరెన్సీ నోట్లు చల్లడం చట్టవిరుద్దం అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మైనర్లకు అనుమతి లేదు
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిల దగ్గర డ్యాన్స్ చేయించరాదు.

నో స్మోకింగ్ జోన్
బార్లలో దూమపానాన్ని పూర్తిగా నిషేధించాలి. డ్యాన్స్ బార్లను నో స్మోకింగ్ జోన్లు గా ప్రకటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

డబ్బు లాగడానికే
ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పోలీసులు మామూళ్లు వసూలు చెయ్యడానికి పనికి వస్తాయని డ్యాన్స్ బార్ల నిర్వహకులు మండిపడుతున్నారు.

కక్ష తీర్చుకుంటున్నారు
పోలీసులు మా మీద కక్ష తీర్చుకోవడానికి ఇలాంటి నియమాలు పెట్టారని బార్ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మన్ జీత్ సింగ్ సేథి ఆరోపించారు.












Click it and Unblock the Notifications