వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ప్రతి కరోనా సోకిన వ్యక్తి మరో ఇద్దరికి వ్యాప్తి: ఐఐటీ-మద్రాస్ అధ్యయనం

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఐఐటి-మద్రాస్ విశ్లేషణ ప్రకారం, కోవిడ్ -19 వ్యాప్తిని సూచించే ఢిల్లీ యొక్క ఆర్-విలువ ఈ వారం 2.1 వద్ద నమోదైంది. ఇది ప్రతి సోకిన వ్యక్తి దేశ రాజధానిలో మరో ఇద్దరికి కరోనా మహమ్మారిని వ్యాపింపజేస్తున్నట్టు సూచిస్తుంది.

భారత్ లో కరోనా పరేషాన్; 15వేలు దాటిన యాక్టివ్ కేసులు; పెరుగుతున్న కేసులు, మరణాలతో ఆందోళనభారత్ లో కరోనా పరేషాన్; 15వేలు దాటిన యాక్టివ్ కేసులు; పెరుగుతున్న కేసులు, మరణాలతో ఆందోళన

 ఢిల్లీలో పెరుగుతున్న ఆర్ విలువ

ఢిల్లీలో పెరుగుతున్న ఆర్ విలువ


ఆర్ లేదా పునరుత్పత్తి విలువ కరోనా సోకిన వ్యక్తి కరోనా వ్యాప్తి చేసే వ్యక్తుల సంఖ్యను సూచిస్తుంది. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటే మహమ్మారి తగ్గుతున్నట్టు భావించవచ్చు. కంప్యూటేషనల్ మోడలింగ్ ద్వారా ప్రాథమిక విశ్లేషణను ఐఐటీ-మద్రాస్ గణిత విభాగం మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయ మరియు ప్రొఫెసర్ ఎస్ సుందర్ నేతృత్వంలో నిర్వహించారు.దాని ప్రకారం, ఈ వారం ఢిల్లీ యొక్క R-విలువ 2.1గా నమోదైంది.

ఢిల్లీలో కరోనా సోకినా ఒక వ్యక్తి మరో ఇద్దరిని ప్రభావితం చేస్తున్నారు

ఢిల్లీలో కరోనా సోకినా ఒక వ్యక్తి మరో ఇద్దరిని ప్రభావితం చేస్తున్నారు


ప్రస్తుతం భారతదేశం యొక్క R-విలువ 1.3 వద్ద ఉందని విశ్లేషణలో కనుగొనబడిందని తెలుస్తుంది. ఇది ఢిల్లీలో కోవిడ్-19 యొక్క నాల్గవ వేవ్ ప్రారంభమని అంచనా వేయగలరా అని అడిగినప్పుడు, ఐఐటి-మద్రాస్‌లోని గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా, మరొక తరంగం ప్రారంభమని ప్రకటించడం చాలా తొందరపాటు చర్య గా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి వ్యక్తి మరో ఇద్దరిని ప్రభావితం చేస్తున్నారని మాత్రమే మేము చెప్పగలమని పేర్కొన్నారు. కానీ కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభాన్ని ప్రకటించడానికి మనం వేచి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

 ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల ఎఫెక్ట్

ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల ఎఫెక్ట్


ఇతర మెట్రో నగరాలకు -- ముంబై, చెన్నై మరియు కోల్‌కతా, ట్రెండ్‌ను నిర్ధారించడానికి కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఝా చెప్పారు. ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. నగరంలో శుక్రవారం 4.64 శాతం పాజిటివ్‌ రేటుతో 1,042 తాజా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ మొదటి 15 రోజుల్లో ఢిల్లీ నుండి సీక్వెన్స్ చేసిన మెజారిటీ శాంపిల్స్‌లో ఓమిక్రాన్ సబ్- వేరియంట్ BA.2.12 కనుగొనబడింది. ఇది నగరంలో ఇటీవలి కోవిడ్ -19 కేసుల పెరుగుదలకు కారణమని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. .

English summary
IIT-Madras study found that every corona infected person in Delhi affects two others.IIT-Madras experts said that they could not come to a conclusion on the Fourth Wave now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X