బీజేపీ ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి, అందర్నీ ఆశీర్వదించండి, హీరో సుదీప్ !
బెంగళూరు/రాయచూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాయకులు, సినీ తారలు బిజీ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతుండటంతో ఒక్క గంట కూడా చాలా విలువైనది అని నాయకులు అనుకుంటున్నారు. బీజేపీ తరుపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్న స్టార్ హీరో సుదీప్ రోడ్ షోలతో అభిమానులు, ప్రజలను ఆకట్టుకున్నారు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని దేవదుర్గ అసెంబ్లీ నియోజక వర్గంలో గురువారం స్టార్ హీరో సుదీప్ ఎన్నికల ప్రచారం చేశారు. దేవదర్గ బీజేపీ అభ్యర్థి కే. శివనగౌడ నాయక్ తరుపున ఎన్నికల ప్రచారం చేశారు. దేవదుర్గలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ నుంచి బసవేశ్వర సర్కిల్ వరకు హీరో సుదీప్ రోడ్ షో నిర్వహించారు.

హీరో సుదీప్ ను చూడటానికి రోడ్లకు ఇరువైపుల వేలాది మంది ఆయన అభిమానులు. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అనంతరం బసవేశ్వర సర్కిల్ లో జరిగిన బహిరంగ సభలో హీరో సుదీప్ మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అందరూ బీజేపీకి మాత్రమే ఓటు వెయ్యాలని హీరో సుదీప్ స్థానిక ప్రజలకు మవని చేశారు.
మీ నియోజక వర్గం ప్రజలు శివనగౌడ నాయక్ ను ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యే చేశారు. ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆయన ఎన్నో మంచి పనులు చేశారని మీరు నాలుగుసార్లు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ఐదోసారి కూడా శివనగౌడ నాయక్ ను గెలిపించాలని స్థానిక ప్రజలకు హీరో సుదీప్ మనవి చేశారు.

దేవదుర్గాలో విద్యాసంస్థల కోసం ప్రత్యేకంగా లేఔట్ చేయించిన ఘనత ఎమ్మెల్యే శివనగౌడ నాయక్ కు చెందుతుందని, ఆయన్ను ఐదెసారి ఎమ్మెల్యే చేస్తే ఇంకా మంచి పనులు చేస్తారని ఆయన మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హీరో సుదీప్ అన్నారు. శివనగౌడ నాయక్ ఎవరో కాదు. మన మనిషి, మనలో ఒక్కడు అని అందరూ అనుకుని ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని హీరో సుదీప్ మనవి చేశారు.
బసవేశ్వర సర్కిల్ లో బహిరంగ సభలో చాలా సేపు మాట్లాడిన హీరో సుదీప్ తరువాత ఓపెన్ టాప్ వాహనం దిగేసి కారులో కుర్చుని నేరుగా హెలిప్యాడ్ దగ్గరకు బయలుదేరారు. బసవేశ్వర సర్కిల్ నుంచి హెలిప్యాడ్ కు వెళ్లే మార్గంలో సుదీప్ ను చూడటానికి రోడ్డుకు ఇరు వైపుల చాలా మంది అభిమానులు వేచి చూస్తున్నా ఆ విషయం పట్టించుకోని హీరో సుదీప్ కారులో వెళ్లిపోవడంతో స్థానిక ప్రజలు కొంచెం అసహనం వ్యక్తం చేశారు. గురువారం హీరో సుదీప్ రాయచూరు జిల్లాలోని కొన్ని నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం చేశారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications