మాజీ ప్రియుడి వేధింపులు: ప్రియురాలి సూసైడ్

భాందుప్ చవుల్‌లో బాధితురాలి ఇంటి పక్కనే నివాసముంటున్న నిందితుడు ప్రథమేష్ ముసర్కర్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని కూడా ఆమెపై ఒత్తిడి పెంచాడు. అయితే వారి వివాహానికి బాధితురాలి తల్లిదండ్రులు అంగీకరించలేదు. కాగా వారిద్దరికీ(బాధితురాలు, నిందితుడికి) వివాహ వయస్సు రాలేదని వివరించినట్లు బాధితురాలు, నిందితుడి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
బాధితురాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రథమేష్ ముసుర్కర్(19)ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తన ఆత్మహత్యకు కారణం ఎవరనేదానిపై ఎలాంటి నోట్ రాసిపెట్టలేదని పోలీసులు చెప్పారు. తనను పెళ్లి చేసుకోకపోతే తన తల్లిదండ్రులను చంపుతానని బాధితురాలిని నిందితుడు ముసుర్కర్ బెదిరింపులకు గురి చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిందితుని బెదిరింపులతో తమకు ఏమైనా జరుగుతుందోనని తీవ్ర భయాందోళనకు గురైన తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితునిపై ఐపిసి సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసినట్లు కుర్ల ప్రభుత్వ రైల్వే పోలీసులు చెప్పారు. నిందితునికి రైల్వే కోర్టు బుధవారం వరకు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications